Congress: కాంగ్రెస్ చింతన్ శివిర్.. సమూల మార్పులకు పార్టీ సిద్ధం

మూడు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ శుక్రవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ మార్పులకు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

Congress: మూడు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ శుక్రవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ మార్పులకు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు పార్టీలో అంతర్గతంగా, నిర్మాణాత్మకంగా సమూల మార్పులు చేయబోతున్నారు. యాభై ఏళ్లలోపు వాళ్లకే ఎక్కువ అకవాశాలు ఇవ్వబోతున్నారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రతి రోజూ సర్వే నిర్వహించేలా పార్టీలో మార్పులు చేయనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేసిన వాళ్లకే టిక్కెట్లు ఇచ్చే ప్రతిపాదన కూడా చేయబోతుంది. ఒక కుటుంబం.. ఒక టిక్కెట్ ప్రతిపాదనలో మరో మినహాయింపు కూడా ఉంది.

Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

దీని ప్రకారం.. ఒక కుటుంబంలో రెండో వ్యక్తికి టిక్కెట్ కావాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు పార్టీలో పనిచేసి ఉండాలి. అయితే, ఈ నిబంధన గాంధీ కుటుంబానికి వర్తిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. వీళ్లు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన గాంధీ కుటుంబం నుంచి ముగ్గురికి టిక్కెట్లు అవసరం. మరోవైపు రాబర్ట్ వాద్రా కూడా 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అయితే, ఐదేళ్లు పార్టీలో పనిచేయాలనే నిబంధన వర్తిస్తే, రాబర్ట్ వాద్రాకు టిక్కెట్ రాదు. మరోవైపు, నిత్యం సర్వేల కోసం ఎవరి మీదో ఆధారపడే బదులు, సొంతంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీనికోసం ఒక శాఖను ఏర్పాటు చేయబోతుంది.

ట్రెండింగ్ వార్తలు