Pournami Girivalam : సెప్టెంబర్ పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణకు అనుమతి లేదు

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఈ నెలలో వచ్చే పౌర్ణమికు కూడా గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారుల అనుమతి ఇవ్వలేదు.

Pournami Girivalam : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో  సెప్టెంబర్ 20,21 తేదీల్లో  పౌర్ణమకి  కూడా గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారుల అనుమతి ఇవ్వలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులను గుంపులు గుంపులుగా అనుమతించట్లేదని అధికారులు వివరించారు. దూర ప్రాంతాలనుంచి భక్తులెవరూ తిరువణ్ణామలై వచ్చి ఇబ్బందులు పడవద్దని అధికారులు తెలిపారు.

కరోనా లాక్ డౌన్ అమలులో ఉండటంతో గత కొన్నినెలలుగా తిరువణ్ణామలైలోని అరుణగిరి కి గిరి ప్రదక్షిణ నిలిపివేశారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తారు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో గిరి ప్రదక్షిణ కూడానిలిపివేశారు.
Also Read : Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశ్ శోభయాత్ర, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

కోవిడ్ నిబంధనల అమలులో భాగంగా అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కూడా శుక్ర,శని, ఆదివారాలలో భక్తులను అనుమతించటంలేదు. ఈ సారి పౌర్ణమి సోమవారం రావటంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో 20,21వ తేదీల్లో  కూడా  ఆలయంలోకి సాధారణ భక్తులను అనుమతివ్వబోమని కలెక్టర్ బి మురుగేష్ ప్రకటించారు. ఈ రెండు రోజులు కూడా  స్వామి వారికి సేవలు అన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలోకి కూడా సెప్టెంబర్ 20, సోమవారం భక్తులకు అనుతిలేదని ఆశ్రమ నిర్వాహకులు ప్రకటించారు.

Giri Valam Not Allowed in September 20th In Tiruvannamalai

 

 

ట్రెండింగ్ వార్తలు