Virat Kohli : కోహ్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ధోనితో ఇదే చివ‌రి మ్యాచ్ కావొచ్చు..! మ‌హి రిటైర్‌మెంట్ పై విరాట్ హింట్ ఇచ్చాడా?

విరాట్ కోహ్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

pic credit : ipl

Virat Kohli – MS Dhoni Retirement : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా నేడు (మే 18 శ‌నివారం) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ప్లేఆఫ్స్‌లో అడుగే ల‌క్ష్యంగా రెండు జ‌ట్లు బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై విజ‌యం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది. ఒక‌వేళ‌ భారీ తేడాతో ఆర్‌సీబీ గెలిస్తే నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌కు చేర‌నుంది. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బ‌హుళా ధోనితో తాను మైదానంలో త‌ల‌డ‌డం ఇదే ఆఖ‌రి సారి కావొచ్చున‌ని అన్నాడు.

జియో సినిమా ఇన్‌సైడ్ అవుట్ షోలో కోహ్లీ మాట్లాడుతూ.. దిగ్గ‌జ ఆట‌గాడు ధోనితో క‌లిసి తాను మ‌ళ్లీ ఆడే అవ‌కాశం ఉండొచ్చు.. లేదా ఇదే చివ‌రిది కావొచ్చు.. ఈ విష‌యం ఎవ‌రికి తెలుసున‌ని అన్నాడు. అభిమానులు ఎంతో అంద‌మైన ఈ క్ష‌ణాలు అస్వాదించాలని సూచించాడు. టీమ్ఇండియా త‌రుపున ధోనితో క‌లిసి ఎన్నో సంవ‌త్స‌రాలు ఆడాన‌ని, కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాన‌ని చెప్పుకొచ్చాడు. ధోని ఫినిష‌ర్‌గా ఎన్నో మ్యాచుల‌ను గెలిపించాడో మ‌నంద‌రం చూశామ‌ని కోహ్లి అన్నాడు.

Mumbai Indians : ముంబై కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేసిన హార్దిక్ పాండ్యా..

కాగా.. గాయంతోనే ధోని ఈ సీజ‌న్‌లో ఆడుతున్నాడు. అందుక‌నే ఆఖ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ బౌండ‌రీలు కొడుతూ అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉన్నాడు. గ‌తేడాది అత‌డి నాయ‌క‌త్వంలో చెన్నై కి ఐపీఎల్ క‌ప్‌ను అందించాడు. ఈ సీజ‌న్‌కు ముందు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని రుతురాజ్‌కు అందించాడు. ఈ క్ర‌మంలో ధోనికి ఇదే ఆఖ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఒక‌వేళ సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే చెన్నై క్వాలిఫ‌య‌ర్‌, ఫైన‌ల్ తో క‌లిపి మ‌రో రెండు మ్యాచులు ఆడే అవ‌కాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. 13 మ్యాచుల్లో 155.16 స్ట్రైక్‌రేటుతో 661 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ కోహ్లి వ‌ద్ద‌నే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ట్రోపీని ఒక్క‌సారి కూడా బెంగ‌ళూరు ముద్దాడ‌లేదు. ఈ క్ర‌మంలో నేడు చెన్నై పై విజ‌యం సాధించి పే ఆఫ్స్‌కు చేరుకుని క‌ప్పును అందుకోవాల‌ని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంది.

Hardik Pandya : ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించిన ముంబై.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేస్తే.. 18 ప‌రుగుల తేడాతో, ల‌క్ష్య ఛేద‌న అయితే 18.1 ఓవ‌ర్ల‌లో విజ‌యం సాధించాల్సి ఉంది. అప్పుడే చెన్నై ర‌న్‌రేటును అధిగ‌మించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.