Mumbai Indians : ముంబై కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేసిన హార్దిక్ పాండ్యా..

ముంబై ఇండియ‌న్స్ ఓ సీజ‌న్‌లో 10 మ్యాచులు ఓడిపోవ‌డం ఇది రెండోసారి.

Mumbai Indians : ముంబై కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేసిన హార్దిక్ పాండ్యా..

Most defeats in a IPL season MI Hardik equals Rohit record

Mumbai Indians – IPL 2024 : కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ చెల‌రేగుతుంద‌ని అంతా భావించారు. తీరా సీజ‌న్ మొద‌ల‌య్యాక ప‌రిస్థితి మారిపోయింది. వ‌రుస ఓట‌ముల‌తో సీజ‌న్‌ను ఆరంభించిన ముంబై ఆఖ‌రి మ్యాచ్‌నైనా విజ‌యంతో ముగించాల‌ని భావించింది. చివ‌రికి ఆ కోరిక నెర‌వేర‌లేదు.

ఈ సీజ‌న్‌లో చివ‌రి మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డిన ముంబై 18 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌వి చూసింది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది ప‌దో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. 8 పాయింట్లతో ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించింది.

Rohit Sharma : కెమెరామెన్‌ను బ‌తిమాలుకున్న రోహిత్..! వీడియో వైర‌ల్‌

ఈ మ్యాచ్‌లో ల‌క్నో మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది.ల‌క్నో బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ (75; 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌గా కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. అనంత‌రం లక్ష్య ఛేద‌న‌లో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ‌(68; 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), న‌మ‌న్ ధిర్ (62 నాటౌట్; 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ) పోరాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

రోహిత్ చెత్త రికార్డు స‌మం..
కాగా.. ముంబై ఇండియ‌న్స్ ఓ సీజ‌న్‌లో 10 మ్యాచులు ఓడిపోవ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2022 సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో ముంబై 10 మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ స‌మ‌యంలో కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. ఇప్పుడు హార్దిక్ పాండ్య నాయ‌క‌త్వంలోనూ ముంబై 10 మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక ఓట‌ములు చ‌విచూసిన ముంబై కెప్టెన్లుగా రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా నిలిచారు.

RCB vs CSK : వ‌ర్షంతో 5 ఓవ‌ర్ల లేదా 10 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగితే.. ఆర్‌సీబీ ఎంత తేడాతో గెల‌వాలో తెలుసా?