Rohit Sharma : కెమెరామెన్‌ను బ‌తిమాలుకున్న రోహిత్..! వీడియో వైర‌ల్‌

మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ చేసిన ప‌ని ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma : కెమెరామెన్‌ను బ‌తిమాలుకున్న రోహిత్..! వీడియో వైర‌ల్‌

Rohit Sharma makes request to cameraman video goes viral

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది. ఆఖ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజ‌న్‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ముగించాల‌ని భావించినా నిరాశ త‌ప్ప‌లేదు. వాంఖ‌డే వేదిక‌గా శుక్ర‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఓట‌మి చ‌విచూసింది. 215 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 6 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ అద‌ర‌గొట్టాడు. రోహిత్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 68 ప‌రుగులు చేశాడు.

అయితే.. మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ చేసిన ప‌ని ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. భార‌త మాజీ ఆట‌గాడు ధవళ్ కులకర్ణితో రోహిత్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స‌మ‌యంలో కెమెరామెన్లు రోహిత్‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని గ‌మ‌నించిన హిట్‌మ్యాన్ ఆడియోను మ్యూట్‌లో పెట్టాల‌ని సూచించాడు. ఓ ఆడియోతో ఇబ్బందుల్లో ప‌డ్డాన‌ని అన్నాడు. ‘భాయ్ కొంచెం ఆ ఆడియో మ్యూట్‌లో పెట్టు. ఇప్పటికే ఒక ఆడియోతో కష్టాల్లో పడ్డా’అని రోహిత్ అన్నాడు.

RCB vs CSK : వ‌ర్షంతో 5 ఓవ‌ర్ల లేదా 10 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగితే.. ఆర్‌సీబీ ఎంత తేడాతో గెల‌వాలో తెలుసా?

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఆ జ‌ట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌తో రోహిత్ మాట్లాడిన మాట‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ‘అన్నీ మారిపోతున్నాయి. నేనేమీ ప‌ట్టించుకోను. ఏదీఏమైనా అది నా ఇల్లు. నేను నిర్మించుకున్న దేవాల‌యం. మొత్తానికి ఇదే నా చివ‌రిది.’ అని హిట్‌మ్యాన్ అన్నాడు.

ముంబై ఇండియ‌న్స్ గురించే రోహిత్ ఇలా అన్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఈ సీజ‌న్‌కు ముందు ఐదు సార్లు టైటిళ్లు అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని హార్దిక్ పాండ్య‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

Hardik Pandya : ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించిన ముంబై.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ