Manchu Manoj: టాలీవుడ్ లో మాస్ కాంబో.. బాలకృష్ణ కి విలన్ గా మంచు మనోజ్.. క్రేజీ ప్రాజెక్టుకు స్కెచ్ వేసిన డైరెక్టర్
బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న మంచు మనోజ్(Manchu Manoj).
Manchu Manoj playing villain role in balakrishna and gopichand malineni movie
- బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన యంగ్ హీరో
- మరి రెండోసారైనా హిట్ పడుతుందా
Manchu Manoj: మిరాయ్ సినిమాతో తన లైఫ్ లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మంచు మనోజ్. ఈ సినిమాలో ఆయన మహాబీర్ లామ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా. నిజం చెప్పాలంటే, మిరాయ్ సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ గా చేసిన మంచి మనోజ్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అంతలా, తన నటనతో అదరగొట్టేశాడు మంచు మనోజ్(Manchu Manoj).
ఇక ఈ సినిమా తరువాత ఆయన వరుసగా విలన్ పత్రాలు చేస్తూ బిజీ అవుతాడని అనుకున్నారు అంతా. అలాగే, అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, మంచు మనోజ్ మాత్రం ఆచితూచి సినిమాలను ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా డేవిడ్ రెడ్డి అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, మంచు మనోజ్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా గురించి ఒక కేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, మంచు మనోజ్ మరోసారి తెరపై తన పవర్ ఫుల్ విలనిజాన్ని ప్రదర్శించనున్నాడట. అయితే, ఆ సినిమాలో హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. అవును, బాలయ్య హీరోగా దర్శకుడు గోపించంద్ మలినేని ఓ పవర్ ఫుల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ గతవారమే స్టార్ట్ అయ్యింది.
అయితే, ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ ను అనుకున్నాడట దర్శకుడు. ఇదే విషయాన్ని మంచు మనోజ్ దగ్గర ప్రస్తావించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. కథ, పాత్ర విషయం పక్కనపెడితే కేవలం బాలయ్య మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట మంచు మనోజ్. అంతేకాదు, గతంలో మంచు మనోజ్ హీరోగా చేసిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ అనే సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు బాలకృష్ణ. అందుకే పేఆఫ్ గా ఉంటుందని ఈ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నాడట మంచు మనోజ్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని టాక్. మరి బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
