RCB vs CSK : వ‌ర్షంతో 5 ఓవ‌ర్ల లేదా 10 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగితే.. ఆర్‌సీబీ ఎంత తేడాతో గెల‌వాలో తెలుసా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది.

RCB vs CSK : వ‌ర్షంతో 5 ఓవ‌ర్ల లేదా 10 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగితే.. ఆర్‌సీబీ ఎంత తేడాతో గెల‌వాలో తెలుసా?

Exact Score RCB Need In Case Of 5 Over Match vs CSK

Royal Challengers Bengaluru vs Chennai Super Kings : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది. ప్లేఆఫ్స్‌లో స్థాన‌మే ల‌క్ష్యంగా శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులు త‌లప‌డ‌నున్నాయి. క్రికెట్ ప్రేమికులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి.

శుక్ర‌వారం, శ‌నివారం బెంగ‌ళూరులో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. అయితే.. శుక్ర‌వారం ఎలాంటి వ‌ర్షం ప‌డ‌లేదు. దీంతో ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ ను కొన‌సాగించాయి. మ‌రో మంచి విష‌యం ఏంటంటే శ‌నివారం ఉద‌యం వాతావ‌ర‌ణం ప్ర‌కాశంతంగా ఉంది. అయితే.. వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా ప్ర‌కారం శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల నుంచి 8 గంట‌ల మ‌ధ్య వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది.

Also Read: ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించిన ముంబై.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

వ‌ర్షం ప‌డితే మ్యాచ్ ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఎంత పెద్ద భారీ వ‌ర్షం కురిసినా స‌రే గంట‌లో చిన్న‌స్వామి మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేయొచ్చు. అత్యాధునికి డ్రైనేజీ వ్య‌వ‌స్థ.. సబ్-ఎయిర్ డ్రైనేజ్, ఏరేషన్ సిస్టమ్ లు అందుబాటులో ఉంది. రాత్రి 10.56 గంట‌ల వ‌ర‌కు గ్రౌండ్ సిద్ద‌మైనా స‌రే ఐదు ఓవ‌ర్ల మ్యాచ్‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఎంత తేడాతో ఆర్‌సీబీ గెల‌వాలంటే..?

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పై చెన్నై గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌ని లేకుండా సీఎస్‌కే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. అయితే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చెన్నై ర‌న్‌రేటును అధిగ‌మించేలా భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది. మొద‌ట ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తే 18 ప‌రుగులు, ల‌క్ష్య ఛేద‌న అయితే 18.1 ఓవ‌ర్ల‌లోనే అంటే 11 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేద‌న పూర్తి చేయాలి.

Also Read : ద్ర‌విడ్ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..?

ఉదాహరణకు.. ఆర్‌సీబీ మొద‌ట 200 పరుగులు చేసిన‌ట్ల‌యితే చెన్నైని 182 పరుగులకే పరిమితం చేయాలి. ఇక్కడ బెంగ‌ళూరు జట్టు ఎన్ని పరుగులు చేసినా కనీసం 18 పరుగుల తేడాతో చెన్నైపై గెల‌వాలి. ఆర్సీబీ టీమ్ ఛేజింగ్ అయితే.. ఉదాహరణకు సీఎస్‌కే 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆర్‌సీబీ 18.1 ఓవర్లలో దానిని ఛేదించాలి. అంటే కనీసం 11 బంతులు మిగిలి ఉండగానే నెగ్గితేనే నెట్ రన్ రేట్‌లో చెన్నైని ఆర్‌సీబీ అధిగ‌మించ‌గ‌ల‌దు.

ఒక‌వేళ వ‌ర్షం కార‌ణంగా ఓవ‌ర్ల త‌గ్గించినా స‌రే.. ఛేద‌న అయితే 11 బంతులే లెక్క. అంటే 15 ఓవర్లలో మ్యాచ్ జరిగితే 13.1 ఓవర్లలో, 10 ఓవర్లలో మ్యాచ్ జరిగితే 8.1 ఓవర్లలో ఆర్‌సీబీ ల‌క్ష్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ ఆడాల్సి వ‌చ్చినా స‌రే 3.1 ఓవ‌ర్లోనే లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. మొద‌ట బ్యాటింగ్ చేస్తే 18 ప‌రుగుల తేడాతో గెల‌వాల్సిందే.