Team India Head Coach : ద్ర‌విడ్ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..?

టీమ్ఇండియా హెచ్ కోచ్ ప‌ద‌విని రాహుల్ ద్ర‌విడ్ త‌రువాత మాజీ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ చేపట్ట‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

Team India Head Coach : ద్ర‌విడ్ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..?

Gautam Gambhir Set To Become Next Team India Head Coach Report

Gautam Gambhir – Team India Head Coach : టీమ్ఇండియా హెచ్ కోచ్ ప‌ద‌విని రాహుల్ ద్ర‌విడ్ త‌రువాత మాజీ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ చేపట్ట‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గంభీర్ ను సంప్ర‌దించిన‌ట్లు ఆంగ్ల‌మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్ర‌యాణం ముగిసిన త‌రువాత దీనిపై త‌దుప‌రి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయని స‌ద‌రు క‌థ‌నాలు పేర్కొన్నాయి.

టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం ఇటీవ‌ల బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తి గల వారు మే 27 సాయంత్రం 6 గంట‌ల లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. కొత్త హెడ్ కోచ్ ప‌ద‌వికాలం మూడున్న‌రేళ్లు ఉండ‌నుంది. 2027 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు కొత్త హెడ్‌కోచ్ ప‌ద‌వి కాలం ఉంటుంది. కోచ్‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వ్య‌క్తి వ‌య‌సు 60 ఏళ్లు ఉండాల‌నే కండిష‌న్‌ను పెట్టింది. అత‌డి అనుభ‌వాన్ని బ‌ట్టి జీతం ఉండ‌నుంద‌ని తెలిపింది.

Rishabh Pant : ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔట్‌.. రిష‌బ్ పంత్ భావోద్వేగ పోస్ట్‌..

కాగా.. ప్ర‌స్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగియ‌నుంది. అయితే ద్ర‌విడ్ మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. అయితే.. ఇందుకు ద్ర‌విడ్ సుముఖంగా లేన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో హెడ్ కోచ్ ప‌ద‌వి రేసులో విదేశీ కోచ్‌లు లాంగ‌ర్, ఫ్లెమింగ్‌ల‌తో పాటు ఎన్‌సీఏ డైరెక్ట‌ర్‌, తెలుగు తేజం వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఉన్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో గంభీర్‌ను హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని బీసీసీఐ పెద్ద‌లు గంభీర్‌ను క‌లుసుకున్న‌ట్లు ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

మెంటార్‌గా అద్భత రికార్డు..

గౌత‌మ్ గంభీర్ ఎప్పుడూ కూడా కోచ్‌గా ప‌నిచేయ‌లేదు. ప్ర‌స్తుతం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. అంత‌క‌ముందు 2022, 2023 సీజ‌న్ల‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. ఈ మూడు సంద‌ర్భాల్లోనూ గంభీర్ మెంటార్ గా ఉన్నజ‌ట్లు ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాదించాయి.

Kavya Maran : ప్లేఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ఆనందంలో కావ్యా పాప ఉండ‌గా.. స‌డెన్‌గా..

ఆట‌గాడిగా గంభీర్ మంచి అనుభ‌వ‌మే ఉంది. 2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో గౌత‌మ్ గంభీర్ స‌భ్యుడు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ రెండు ఫైన‌ల్ మ్యాచుల్లో గంభీర్ అద్భుతంగా ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 2011 నుంచి 2017 వ‌ర‌కు కోల్‌క‌తాను న‌డిపించాడు. అత‌డి నాయ‌క‌త్వంలో 2012, 2014 ల‌లో కోల్‌క‌తా ఐపీఎల్ విజేత‌గా నిలిచింది.