Rishabh Pant : ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔట్‌.. రిష‌బ్ పంత్ భావోద్వేగ పోస్ట్‌..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు విఫ‌ల‌మైంది.

Rishabh Pant : ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔట్‌.. రిష‌బ్ పంత్ భావోద్వేగ పోస్ట్‌..

PIC Credit : DC twitter

DC skipper Rishabh Pant : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు విఫ‌ల‌మైంది. గురువారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డో ఓ చోట మిణుకుమిణుకు మంటున్న ఢిల్లీ ఫ్లేఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. ఈ సీజ‌న్‌లో 14 మ్యాచులు ఆడిన ఢిల్లీ 7 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. మ‌రో 7 మ్యాచుల్లో ఓడిపోయింది. 14 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. కాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశ‌లు నెర‌వేర‌క‌పోవ‌డంతో శుక్ర‌వారం పంత్ అబిమానుల‌ను ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.

2022 డిసెంబ‌ర్‌లో పంత్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. దీంతో దాదాపు 15 నెల‌ల పాటు అత‌డు ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌తోనే అత‌డు మైదానంలోకి అడుగుపెట్టాడు. 13 మ్యాచుల్లో 446 ప‌రుగులు చేశాడు.

MI vs LSG : ల‌క్నోకు ఛాన్సుంది..? ముంబై పై ఎంత తేడాతో గెల‌వాలంటే..? మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందే!

రీ ఎంట్రీలో మంచి ఫామ్‌ను క‌న‌బ‌రచ‌డంతో రాబోయే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం బీసీసీఐ ప్ర‌క‌టించిన 15 మంది స‌భ్యులు గ‌ల టీమ్ఇండియా జ‌ట్టులో చోటు సంపాదించుకున్నారు. వికెట్ కీప‌ర్ల కోటాలో అత‌డికి అవ‌కాశం క‌ల్పించారు.

చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకు స‌హ‌క‌రించిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌కుండా ఉండ‌లేను. ఇక అభిమానుల ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది. వారి ప్రేమ, ఆప్యాయ‌త లేకుండా ఇవేవీ సాధ్యం అయ్యేవి కాదు. నేను ఇష్ట‌ప‌డే క్రికెట్ ఆడుతున్నందుకు ఎంతో థ్రిల్‌గా ఉంది. నా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న అందిస్తాను. మ‌న్ముందు మ‌రిన్ని అద్భుత‌మైన జ్ఞాప‌కాల‌ను కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

RCB vs CSK : వ‌ర్షం కార‌ణంగా సీఎస్‌కేతో మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప‌రిస్థితి ఏంటి?

ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న చివ‌రి మ్యాచ్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీలో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 19 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్ అనంత‌రం పంత్ అభిమానుల‌తో ఫోటోలు, వీడియోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ పంత్ త‌న మ‌న‌సులోని మాట‌ను పంచుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)