MI vs LSG : ల‌క్నోకు ఛాన్సుంది..? ముంబై పై ఎంత తేడాతో గెల‌వాలంటే..? మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందే!

ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది.

MI vs LSG : ల‌క్నోకు ఛాన్సుంది..? ముంబై పై ఎంత తేడాతో గెల‌వాలంటే..? మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందే!

PIC Credit : LSG

Mumbai Indians vs Lucknow Super Giants : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. వాంఖ‌డే వేదిక‌గా నేడు (శుక్ర‌వారం మే 17) ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. కాబ‌ట్టి త‌మ చివ‌రి మ్యాచులోనైనా గెలిచి ఈ సీజ‌న్‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ముగించాల‌ని చూస్తోంది. అదే స‌మ‌యంలో పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ స్థానాన్ని కాస్త మెరుగుప‌రచుకోవాల‌ని అనుకుంటోంది. ల‌క్నో పై విజ‌యం సాధిస్తే ఆఖ‌రి స్థానంలో ఉన్న ముంబై ఓ స్థానం ఎగ‌బాకి తొమ్మిదో స్థానంతో సీజ‌న్‌ను అవ‌కాశం ఉంది.

అటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప‌రిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేర‌డం దాదాపుగా అసాధ్యం. సాంకేతికంగానే ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్  రేసులో ఉంది. ల‌క్నో గ‌నుక ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందే. మొద‌టగా ముంబైతో మ్యాచ్‌లో 310 ప‌రుగుల‌తో తేడాతో గెలవాల్సి ఉంటుంది. కాగా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు కూడా 300 స్కోరు చేయ‌లేదు. అలాంటిది 300 ఫ్ల‌స్ ప‌రుగుల‌తో గెల‌వ‌డం అంటే దాదాపుగా అసాధ్య‌మే.

Pat Cummins : హైదరాబాద్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో క‌మిన్స్‌.. నువ్వు గొప్పొడివి సామీ..!

పోనీ 310 ప‌రుగుల‌తో గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా అంటే అదీ లేదు. సీఎస్‌కే వ‌ర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ ఫ‌లితంపై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. సీఎస్‌కే పై ఆర్‌సీబీ స్వ‌ల్ప తేడాతో గెల‌వాలి. అప్పుడు ల‌క్నో, సీఎస్‌కే, ఆర్సీబీ జ‌ట్ల పాయింట్లు 14గా ఉంటాయి. అప్పుడు సీఎస్‌కే, బెంగ‌ళూరు కంటే మెరుగైన ర‌న్‌రేటును క‌లిగి ఉంటేనే ల‌క్నో ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ల‌క్నో, ముంబై జ‌ట్లు ఐదు సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో నాలుగు మ్యాచుల్లో గెలిచి ల‌క్నో ఆధిప‌త్యంలో కొన‌సాగుతోంది.

తుది జట్ల (అంచనా)..
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(కెప్టెన్‌), నెహాల్ వదేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, కొయెట్జీ, పీయూష్ చావ్లా

RCB vs CSK : వ‌ర్షం కార‌ణంగా సీఎస్‌కేతో మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప‌రిస్థితి ఏంటి?

లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్, మార్క‌స్ స్టొయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, యుద్వీర్ సింగ్.