Pat Cummins : హైదరాబాద్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో క‌మిన్స్‌.. నువ్వు గొప్పొడివి సామీ..!

కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ నాయ‌క‌త్వంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దూసుకుపోతుంది.

Pat Cummins : హైదరాబాద్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో క‌మిన్స్‌.. నువ్వు గొప్పొడివి సామీ..!

pic credit : SRH

Pat Cummins plays gully cricket : కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ నాయ‌క‌త్వంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దూసుకుపోతుంది. ఈ సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఫ్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక విజయం సాధిస్తే టాప్‌-2లో నిలిచే అవ‌కాశం ఉంది. అలా జ‌ర‌గాలంటే రాజ‌స్థాన్ త‌న చివ‌రి మ్యాచ్‌ను ఓడిపోవాల్సి ఉంటుంది.

కాగా.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల్లో కెప్టెన్ క‌మిన్స్ పాత్ర ఎంతో కీల‌కం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పరిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా డెత్‌, మిడిల్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేస్తూ కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు ప‌డ‌గొడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అదే స‌మ‌యంలో త‌న బ్యాటింగ్ స్కిల్స్‌తోనూ భారీ స్కోర్ల‌లో త‌న వంతు సాయం చేస్తున్నాడు. జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చ‌డం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు.

RCB vs CSK : వ‌ర్షం కార‌ణంగా సీఎస్‌కేతో మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప‌రిస్థితి ఏంటి?

క‌మిన్స్ ఓ గొప్ప ఆట‌గాడే కాదు.. మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తి. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాడు. విద్యార్థుల‌తో ముచ్చ‌టించాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న గ్రౌండ్‌లో పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడాడు. స్వ‌త‌హాగా ఆల్‌రౌండ‌ర్ అయిన క‌మిన్స్‌.. వికెట్ కీపింగ్ కూడా చేశాడు. త‌న బ్యాటింగ్‌తో పిల్ల‌ల‌ను అల‌రించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిన్నారుల‌తో స‌మ‌యం గ‌డిపిన పాట్ క‌మిన్స్‌ను నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

గ‌తేడాది ఎంతో ప్ర‌త్యేకం..
ఇదిలా ఉంటే.. క‌మిన్స్‌కు గ‌తేడాది ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్స్‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో పాటు యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా అత‌డి నాయ‌క‌త్వంలోనే గెలుచుకుంది. అంతేనా భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యం సాధించింది. దీంతో వేలంలో అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ రూ.20.50 కోట్ల‌కు సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా నియ‌మించింది. అత‌డి నాయ‌క‌త్వంలో ఈ సీజ‌న్‌లో అద్భుతంగా ఆడుతున్న హైద‌రాబాద్.. ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Kavya Maran : ప్లేఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ఆనందంలో కావ్యా పాప ఉండ‌గా.. స‌డెన్‌గా..