ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోర్
Pic Courtesy@EspnCricInfo
ICC Mens T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. సంజూ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు, ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 రన్స్ చేశారు. చివరలో సిక్సర్ల దూబేగా గుర్తింపు పొందిన శివమ్ దూబే విధ్వంసం సృష్టించాడు. 8 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. చివరి ఓవర్ లో దూబే బాదుడుతో 24 పరుగులు వచ్చాయి.
టీ 20 వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్లు..
శ్రీలంక వర్సెస్ కెన్యా (2007) – 260/6
భారత్ వర్సెస్ జింబాబ్వే (2026) – 256/4
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (2026) – 255/5
వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే (2026) – 254/6
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2026) 253/7
