Best Mileage Bikes : కొంటే ఇలాంటి బైక్ కొనాలి? 150-200cc టాప్ 5 బెస్ట్ మైలేజ్ బైకులివే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Best Mileage Bikes : మీరు 150cc నుంచి 200cc మధ్య బెస్ట్ మైలేజ్ అందించే బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-రేటెడ్ 5 బైకుల గురించి ఫుల్ డిటెయిల్స్..
Best Mileage Bikes
- కొత్త బైకు కొనేవారికి అద్భుతమైన మైలేజీ అందించే బైకులివే
- 150cc నుంచి 200cc వరకు బెస్ట్ మైలేజీ బైకు ఆప్షన్లు
- టీవీఎస్ అపాచీ నుంచి హోండా యునికార్న్ వరకు ఫుల్ లిస్ట్
Best Mileage Bikes : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? భారత టూవీలర్ మార్కెట్లో అనేక కంపెనీల బైకులు అందబాటులో ఉన్నాయి. 2025లో దేశీయ మార్కెట్లో టూవీలర్ అమ్మకాలు 20 మిలియన్ యూనిట్లను దాటాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 7 శాతం నుంచి 8 శాతం పెరిగాయి.
మీరు 150cc మైలేజీ నుంచి 200cc మధ్య బెస్ట్ మైలేజీ అందించే బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశీయ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు టాప్ 5 బైక్‌లు ఏంటి? ఎంత మైలేజీ అందిస్తాయి? ధర ఎంత ఉంటుందో అనేది ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
టీవీఎస్ అపాచీ RTR 160 2V :
మీరు స్పోర్టీ బైక్ కోసం చూస్తుంటే.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V బైక్ తీసుకోవచ్చు. 160cc ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఫ్యూయిల్ పరంగా దాదాపు 61 కి.మీ/లీటరు మైలేజీని అందిస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V బైకు ధర రూ. 1.12 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
బజాజ్ పల్సర్ NS160 :
బజాజ్ పల్సర్ NS160 మరో స్పోర్టీ బైక్. బజాజ్ పల్సర్ NS160 160.3cc ఇంజిన్‌తో వస్తుంది. లీటరుకు 52 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ధర విషయానికి వస్తే.. బజాజ్ పల్సర్ NS160 రూ. 1.21 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
బజాజ్ పల్సర్ N160 :
బజాజ్ ఆటో బజాజ్ పల్సర్ N160 మరో అద్భుతమైన బైక్. మంచి మైలేజ్, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. బజాజ్ పల్సర్ N160 160cc ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. లీటరుకు 51 కి.మీ వరకు ఫ్యూయిల్ కెపాసిటీని అందిస్తుంది. బజాజ్ పల్సర్ N160 ధరలు రూ. 1.14 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.
యమహా R15 V4 :
యమహా మోటార్ కంపెనీకి చెందిన యమహా R15 V4 అద్భుతమైన బైక్. యమహా R15 V4 బైక్ 155cc ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. లీటరుకు 50 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. యమహా R15 V4 బైకు ధర రూ. 1.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
హోండా యునికార్న్ :
భారత మార్కెట్లో ఈ హోండా బైక్ అత్యంత ఫ్యూయల్ కెపాసిటీ ఉన్న బైక్‌లలో ఒకటి. హోండా యునికార్న్ 162.7cc ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. లీటరుకు 50 కి.మీ వరకు ఫ్యూయిల్ సామర్థ్యంతో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. హోండా యునికార్న్ రూ. 1.12 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
