Apple iPhone Air : సూపర్ డిస్కౌంట్ మావా.. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?
Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ప్రస్తుతం అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా వైడ్ రేంజ్ యూజర్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Apple iPhone ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కెమెరాలు, ఆడియో డివైజ్‌లు, మరిన్నింటిపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.

ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ రూ. 29,400 కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ డీల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్ ఎయిర్ అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా అమెజాన్‌లో రూ.93,499కి లిస్ట్ అయింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.

ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ A19 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల OLED డిస్ప్లే, 3000 నిట్స్ వరకు పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్, ప్రోమోషన్ టెక్ అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా ఐఫోన్ ఎయిర్ 48MP ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరాతో వస్తుంది. ఈ ఐఫోన్ 2x ఆప్టికల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 5.6mm మందం, దాదాపు 165 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్, USB-C ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
