Google Bard AI Chatbot : గూగుల్ బార్డ్ ఏఐ ఇమేజ్ సెర్చ్‌లో ఫొటోను చూపిస్తే.. పూర్తి వివరాలను పసిగట్టేస్తుంది.. ఎలా వాడాలో తెలుసా?

Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.

Google Bard AI Chatbot respond with images : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే దృష్టిపెట్టింది. టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీనే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. చాట్ జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా గూగుల్ బార్డ్ ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇతర చాట్ బాట్‌ల కన్నా గూగుల్ బార్డ్ ఏఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వచ్చింది. చాట్ జీపీటీ కేవలం టెక్స్ట్ మాత్రమే డిటెక్ట్ చేయగలదు. కానీ, గూగుల్ బార్డ్ ఏఐ మాత్రం టెక్స్ట్ మాత్రమే కాదు.. డైలాగ్స్, ఫొటోలకు సంబంధించి వివరాలు అడిగినా టక్కున సమాధానమిస్తోంది.

కొన్ని వారాల క్రితమే గూగుల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (Google I/O 2023)లో జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్, బార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త చాట్‌బాట్ OpenAI ChatGPT, Microsoft, GPT4-పవర్ బింగ్‌కు పోటీగా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ బార్డ్ ఇప్పటికే పాపులర్ అయిన చాట్‌జిపిటికి దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ.. గూగుల్ సరికొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది. పోటీదారుల కన్నా మరింత సమాచారాన్ని వినియోగదారులను అందించేలా AI చాట్‌బాట్‌ను అప్‌డేట్ చేస్తోంది.

వార్షిక I/O ఈవెంట్‌లో బార్డ్ ఏఐ లాంచ్ సందర్భంగా, రాబోయే వారాల్లో బార్డ్‌లో కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. బార్డ్ డార్క్ మోడ్, వెబ్‌లో టాపిక్‌ల కోసం సెర్చ్ చేయడం, కోడింగ్‌లో సాయం చేయడం వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. గూగుల్ ఇప్పటికే ఈ ఫీచర్లలో కొన్నింటిని రిలీజ్ చేయగా.. చివరికి గూగుల్ బార్డ్‌కి ఫొటోలకు కూడా రెస్పాండ్ అయ్యేలా రూపొందించింది.

Read Also : Apple iPhone 14 Red : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌ 14పై భారీ డీల్.. తక్కువ ధరకు ఇప్పుడే కొనేసుకోండి..!

గూగుల్ బార్డ్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు ప్రాంప్ట్ సెర్చ్ రిజల్ట్స్ చూపగలదని గూగుల్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం భావిస్తోంది. తద్వారా వినియోగదారులకు అధిక మొత్తంలో సమాచారాన్ని అందించడానికి గూగుల్ ఇమేజ్ రిజల్ట్స్ సాయపడతాయని గూగుల్ చెబుతోంది. ఫొటోలతో ఏదైనా సమాచారాన్ని ట్రాక్ చేయడానికి బార్డ్ ఏఐ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేస్తుంది.

గూగుల్ బార్డ్ ఇమేజ్ సెర్చ్ ఎలా వాడాలంటే? :
ఫొటోల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే నేరుగా గూగుల్ బార్డ్‌ని అడగవచ్చు. మీరు సూచించిన ప్రతి ఫొటో దాని మూలాన్ని చూపిస్తుంది. ప్రాంప్ట్ విండో ద్వారా బార్డ్ సెర్చ్ రిజల్ట్స్ విజువల్స్‌గా అందజేస్తుంది. వినియోగదారులు వెతికే సమాచారంపై పూర్తి అవగాహన కల్పించడంలో సాయపడతుంది.

బార్డ్ ఏఐ ఎలా పనిచేస్తుందంటే? :
* bard.google.com విజిట్ చేయండి.
* సెర్చ్ బాక్సులో మీ ప్రాంప్ట్‌ని ఎంటర్ చేయండి.
* గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ ఆప్షన్‌తో గూగుల్ బార్డ్ సంబంధిత సమాధానాలను సూచిస్తుంది.

Google Bard AI chatbot now responds with images, how to use

ఉదాహరణకు, మీరు ట్రిప్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నారా? మీరు సందర్శించబోయే పర్యాటక ప్రదేశాలను చూపించమని గూగుల్ బార్డ్‌ని అడగవచ్చు. మీరు చర్మ సంరక్షణకు అవసరమైన ప్రొడక్టులను కూడా కొనుగోలు చేయొచ్చు. గూగుల్ సెర్చ్‌లో ఫొటోలను సూచించే ప్రొడక్టులను చూసి మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు ఫొటోలను సూచించిన ప్రొడక్టుల వివరాలను అడగవచ్చు. బార్డ్ మీకు మంచి అవగాహన కోసం ఫొటోలతో పాటు ప్రొడక్టుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా చూపిస్తుంది. ప్రస్తుతానికి, అమెరికా, భారత్ సహా 180 దేశాల్లోని గూగుల్ వినియోగదారులు ఈ బార్డ్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా, యూరోపియన్ యూనియన్, కెనడాలో బార్డ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ప్రాంతాలకు బార్డ్ ఏఐ టూల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. లాంగ్వేజీ విషయానికొస్తే.. వినియోగదారులు అమెరికన్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్, హిందీతో పాటు జపనీస్, కొరియన్‌లలో బార్డ్‌ను ప్రాంప్ట్ చేయవచ్చు. గూగుల్ భవిష్యత్తులో మరిన్ని భాషాలకు సపోర్టు అందించనుంది.

Read Also : Simple One Electric Scooter : రూ. 1.45 లక్షలకే సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ దూసుకెళ్తుంది..!

ట్రెండింగ్ వార్తలు