CI GADDAM MALLESH
Madhapur Circle Inspector : మాదాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ఆయన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలుసైతం చేశారు. సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో సీఐ ప్రకటనలు చేశారు. అన్నిచెప్పిన సీఐ మల్లేశే నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.. సీఐ చెప్పిన నిబంధనలు సామాన్య ప్రజలకేనా.. వాళ్లకు వర్తించవా అంటూ చర్చించుకుంటున్నారు.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చూసి వచ్చేశారు.. యువతిని కాల్చి చంపేశారు
కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ మల్లేశ్ నిబంధనలు ఉల్లంఘించారు. బ్రిడ్జిపై ఎవ్వరూ బర్త్ డే వేడుకలు చేయొద్దని హెచ్చరికలు చేసిన ఆయన.. తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు. బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలో పాల్గొన్న సీఐకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలను చూసిన ప్రజలు సీఐగారూ.. ఇదేం పనిఅండి అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు కేవలం మాకేనా? మీకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీస్తున్నారు.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఆన్‌లైన్ లావాదేవీలపై ఈసీ నిఘా