Online Transactions : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఆన్‌లైన్ లావాదేవీలపై ఈసీ నిఘా

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు.

Online Transactions : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఆన్‌లైన్ లావాదేవీలపై ఈసీ నిఘా

Online Transactions : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొందరు నాయకులు డబ్బుతో, మరికొందరు మద్యంతో ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం రవాణ జరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఈసీ గట్టి నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ డబ్బు, మద్యం అక్రమ రవాణను అడ్డుకుంటోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం పట్టుబడ్డాయి.

క్యాష్ రూపంలో నగదు పంపిణీ చేస్తే దొరికిపోతాం అని తెలిసి.. కొందరు ఆన్ లైన్ లావాదేవీలపై కన్నేశారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో ఈసీ అలర్ట్ అయ్యింది. ఆన్ లైన్ లావాదేవీలపైనా నిఘా పెట్టింది.

ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెంచింది. ఆన్ లైన్ లావాదేవీలపై పర్యవేక్షణ జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లావాదేవీలపైనా నిఘా పెట్టింది. ఆన్ లైన్ లావాదేవీల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తోంది. డబ్బు పంపిణీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ షాడో టీమ్స్ దర్యాఫ్తు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 250 కోట్ల రూపాయల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు. ఆన్ లైన్ లావాదేవీలపై ఢిల్లీ నిర్వచన్ సదన్ లో స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు.

Also Read : హైదరాబాద్‌లో జీఎస్టీ రిఫండ్ స్కాం.. నకిలీ పత్రాలతో ఎలా బోల్తా కొట్టించారో తెలుసా?