Epic Song: ‘ఎపిక్’ మూవీ నుంచి ‘సంచారమే’ సాంగ్ విడుదల.. ఇది గోరటి వెంకన్న మ్యాజిక్
ఎపిక్(Epic Song) సినిమా నుంచి సంచారమే సాంగ్ విడుదల చేసిన మేకర్స్.
Sancharame song released from Epic movie
Epic Song: బేబీ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్(Epic Song)’. 90’స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు, 90’స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గానే ఎపిక్ సినిమా తెరకెక్కుతోంది. 90’స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో బాగా పాపులర్ అయిన రోహన్ రాయ్ పాత్ర కొనసాగింపుగా ఎపిక్ సినిమా రానుంది.
Varanasi: స్టైలీష్ లుక్ లో మహేష్ బాబు.. వారణాసి నుంచి లేటెస్ట్ పిక్స్ వైరల్
ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సంచారమే అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను హేషామ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేయగా.. ప్రముఖ జానపద కళాకారుడు గోరటి వెంకన్న రాయడం విశేషం. అంతేకాదు ఆయన గాత్రాన్ని కూడా అందించారు. దాంతో, ఈ పాట చాలా ప్రత్యేకంగా మారింది. ఇక లండన్ వీధుల్లో ఒక ప్రేమ జంట సరదాగా పడుకునే పాటే ఇది. దీంతో, ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
