PM Kisan : పీఎం కిసాన్ 22వ వాయిదా వచ్చేస్తోంది.. ఈ 4 పనులు చేసిన రైతులకే రూ. 2వేలు.. మీరు చేశారో లేదో చెక్ చేసుకోండి!
PM Kisan 22nd Installment Date : పీఎం కిసాన్ 22వ వాయిదా అతి త్వరలో రాబోతుంది. ముందుగా ఈ 4 ముఖ్యమైన పనులను పూర్తి చేసిన రైతులకు మాత్రమే 22వ వాయిదా రూ. 2వేలు అందుకోనున్నారు.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
PM Kisan 22nd Installment Date ( AI Image Credit to Original Source )
- పీఎం కిసాన్ 22వ వాయిదా విడుదలపై రైతుల్లో ఆశలు
- రూ. 2వేలు వాయిదా అందుకోవాలంటే ఈ పనులు తప్పక చేయాలి
- పీఎం కిసాన్ విడత డబ్బులు పొందాలంటే అర్హతలేంటి?
- దేశవ్యాప్తంగా రైతులకు ప్రతి ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం
PM Kisan 22nd Installment Date : పీఎం కిసాన్ 22వ వాయిదాపై ఉత్కంఠ నెలకొంది. రాబోయే ఈ వాయిదా డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులంతా ఆశగా చూస్తున్నారు. అయితే, ఈ వాయిదా రూ. 2వేలు అందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేసి ఉండాలి.
లేదంటే పైసా కూడా ఖాతాలో పడదు. పీఎం కిసాన్ 22వ వాయిదా విడుదలకు ముందుగానే ఈ పనులను పూర్తి చేసినవారికే వాయిదా అందుతుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడతకు సంబంధించి రైతుల్లో భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతుకు ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున మూడు విడతలుగా ఈ పథకం కింద ప్రభుత్వం 21 విడతలను విడుదల చేసింది. రైతులంతా ఇప్పుడు 22వాయిదా కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరులో 21వ విడతను విడుదల చేశారు. 9 కోట్లకు పైగా రైతులకు దాదాపు రూ.18వేలు కోట్లు పంపిణీ చేశారు. మొత్తంగా, ఈ పథకం ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.4 లక్షల కోట్లకు పైగా విడుదల చేసింది. 22వ వాయిదా డబ్బులు అందుకోవాలంటే రైతులు ఈ 4 ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయండి :
కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ డబ్బులను ఆధార్ సీడెడ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా చెల్లిస్తుంది. రైతులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి. మీరు ఇంకా ఆధార్ బ్యాంకు లింక్ చేయకపోతే రావాల్సిన రూ. 2వేలు నిలిచిపోతాయి. వెంటనే రైతులు తమ బ్యాంకు హోం బ్రాంచ్ కు వెళ్లడం లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఆధార్ సీడింగ్ పూర్తి చేయొచ్చు.
మీ ఇ-కేవైసీని పూర్తి చేయండి :
పీఎం కిసాన్ లబ్ధిదారులందరికి ఇ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇ-కేవైసీ లేకుండా రైతులు తర్వాతి వాయిదాను పొందలేరు. రైతులు ఇ-కేవైసీని మూడు విధాలుగా పూర్తి చేయొచ్చు.
ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ :
మొబైల్ నెంబర్ కు ఆధార్ లింక్ చేసి ఉంటే రైతులు పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీటీతో వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ ఇ-కేవైసీ : రైతులు ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్ కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) విజిట్ చేయొచ్చు.
ఫేస్ అథెంటికేషన్ : ఈ CSC సెంటర్లలో ఫేస్ అథెంటికేషన్ ఆధారిత వెరిఫికేషన్ కూడా అందిస్తాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, శారీర వికలాంగులైన రైతులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం… పీఎం కిసాన్ రిజిస్టరర్డ్ రైతులకు ఇ-కేవైసీ తప్పనిసరి.
మీ భూమి రికార్డులను వెరిఫై చేయండి :
పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు సాగుభూమి తప్పక ఉండాలి. ల్యాండ్ డాక్యుమెంట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖతో అప్ డేట్ చేయించుకోవాలి. లేదంటే మీకు రావాల్సిన వాయిదా నిలిచిపోవచ్చు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాలు రైతు రిజిస్ట్రేషన్, ల్యాండ్ వెరిఫికేషన్ డ్రైవ్‌లను నిర్వహించాయి. రైతులు తమ భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి ఆధార్, పీఎం కిసాన్ ఐడీతో ఇంటిగ్రేట్ చేసుకోవాలి.
మీ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో ఇలా చెక్ చేయండి :
రైతులు అధికారిక పోర్టల్‌లో తమ లబ్ధిదారుల స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక (pmkisan.gov.in)ని విజిట్ చేసి ‘Know Your Status’ లేదా ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి. పూర్తి వివరాలను చెక్ చేసేందుకు మీ ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
పేమెంట్ ఆలస్యం కాకుండా ఉండాలంటే మీ పేరు స్పెల్లింగ్, IFSC కోడ్, అకౌంట్ నంబర్‌తో సహా ప్రొఫైల్‌లోని బ్యాంక్ అకౌంట్ అన్ని వివరాలను వెరిఫై చేసుకోండి.
22వ వాయిదా ఎప్పుడు వస్తుంది? :
మీడియా నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ పథకం 22వ విడత త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. బహుశా మార్చి 2026లో ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చు. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు.
ఈ పథకం కింద రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెల్లో అందుకుంటారు. ఇంకా రైతులు ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే వెంటనే ల్యాండ్ రికార్డులను వెరిఫై చేయించుకోవాలి. లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకోవాలి. రాబోయే రూ. 2వేలు ఆలస్యం కాకుండా ఉండాలంటే ఈ పనులన్ని సకాలంలో పూర్తి చేసి ఉండాలని అధికారులు సూచించారు.
రైతుల కోసం ఫైనల్ చెకింగ్ లిస్ట్ :
- బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ ఉండాలి.
- ఇ-కేవైసీ పూర్తి అయి ఉండాలి.
- భూమి యాజమాన్యం వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- పీఎం కిసాన్ పోర్టల్‌లో సరైన పేరు, బ్యాంక్ వివరాలు
- ఈ షరతులు నెరవేరితే 22వ విడత విడుదలైన తర్వాత రైతులు ఎలాంటి సమస్యలు లేకుండా రూ. 2వేలు వాయిదాను అందుకుంటారు.
పీఎం కిసాన్‌కు ఎవరు అర్హులు? :
పీఎం కిసాన్ పథకానికి అర్హతకు ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఇవి ఉండాలి.
- భారత పౌరుడిగా ఉండాలి
- సొంత సాగు భూమి
- చిన్న లేదా సన్నకారు రైతుగా ఉండాలి.
- నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పొందే పెన్షనర్ కాకూడదు.
- ఆదాయపు పన్ను దాఖలు చేసేవాళ్లు కాకూడదు
- సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
ఇప్పటివరకూ రిజిస్టర్ చేసుకోని రైతులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
- అధికారిక (pmkisan.gov.in) విజిట్ చేయండి.
- ‘New Farmer Registration’పై క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్, కాప్చాను ఎంటర్ చేయండి.
- అవసరమైన వివరాలను నింపి ఫారమ్‌ను సమర్పించండి.
- ఏవైనా సందేహాల కోసం రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ (155261, 011-24300606)కు కాల్ చేయవచ్చు
