Instagram Blue Tick : ఇన్‌స్టాలో ‘బ్లూ టిక్’ ఇలా తెచ్చుకోవచ్చు..? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Instagram Blue Tick : మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అందులో సెలబ్రిటీల మాదిరిగా ఇన్‌స్టాలో బ్లూ టిక్ కావాలా? అయితే ఈ ప్రాసెస్ చాలా సింపుల్..

Instagram Blue Tick : మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అందులో సెలబ్రిటీల మాదిరిగా ఇన్‌స్టాలో బ్లూ టిక్ కావాలా? అయితే ఈ ప్రాసెస్ చాలా సింపుల్.. కానీ, మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేయాలంటే ముందుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. మీ అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాత మీరు బ్లూ టిక్ (Verification Badge)కు అర్హులో కాదో ఇన్ స్టాగ్రామ్ ధ్రువీకరిస్తుంది. ఒకవేళ మీ ఇన్ స్టా అకౌంట్ వెరిఫికేషన్ అప్రూవల్ అయితే.. మీ ఇన్ స్టా అకౌంట్లో ప్రొఫైల్ పిక్ దగ్గర బ్లూ టిక్ కనిపిస్తుంది. అంటే.. మీ ఇన్ స్టా అకౌంట్ ఇకపై అధికారిక అకౌంట్ అని చెప్పవచ్చు. Instagram యూజర్ పేరు పక్కనే ఈ Blue Tick మార్క్ కనిపిస్తుంది. ఇంతకీ ఈ బ్లూ టిక్ తెచ్చుకోవాలంటే ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Instagramలో వెరిఫై బ్యాడ్జ్ కోసం దరఖాస్తు ఇలా.. :
ఇన్ స్టా యూజర్లు ముందుగా మీరు ఏ ఇన్ స్టా అకౌంటుకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ కావాలనుకుంటున్నారో అదే అకౌంట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మల్టీపుల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నవారికే ప్రత్యేకించి ఈ ప్లాట్ ఫారం అవకాశం కల్పిస్తోంది.

1. ముందుగా, మీరు ఇన్ స్టా అకౌంట్లో స్క్రీన్ దిగువన కుడివైపున ప్రొఫైల్ పిక్చర్ ఐకాన్‌పై నొక్కాలి.
2. ఆ తర్వాత, యాప్ మీ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది.
3. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Hamburger Menuపై నొక్కండి. ఆ తర్వాత Settings బటన్‌పై Tap చేయాలి.
4. ఇప్పుడు మళ్లీ Account పై Tap చేయండి.
5. ఆ వెంటనే Request Verificationపై Tap చేయండి.
6. ఇప్పుడు మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.
7. మీ ఫొటో గుర్తింపు ఐడీ ఏదైనా ఉంటే దాని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 8. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID లేదా అధికారిక బిజినెస్ డాక్యుమెంట్లను పత్రాలను ఇవ్వవచ్చు.
9. చివరిగా మీరు Submit బటన్‌పై Tap చేయండి.

Instagram What To Keep In Mind Before Applying For A Verification Badge

Instagram : వెరిఫై కోసం అప్లయ్ చేసే ముందు ఇవి తప్పక గుర్తించుకోవాలి..

– ఇన్‌స్టాగ్రామ్ మీ అకౌంట్ ధృవీకరణకు అర్హత ఉందా లేదా చెక్ చేసుకోండి.
– మీ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
– అంటే.. మీ అకౌంట్ వెంటనే వెరిఫై అయిపోతుందని అర్థం కాదు.
– మీ అకౌంట్ వెరిఫికేషన్ అవుతుందనే గ్యారెంటీ లేదు.
– మీ అభ్యర్థనను ఇన్ స్టా గ్రామ్ ఎలాంటి కారణాలు చెప్పకుండానే రిజెక్ట్ చేయవచ్చు. – ఇన్ స్టా యూజర్ ఒకసారి మాత్రమే ఒక అప్లికేషన్ సమర్పించగలరు.
– ఒకసారి ధృవీకరించిన బ్యాడ్జ్ కోసం మళ్లీ అప్లయ్ చేయరాదు..
– అనేక సార్లు అప్లయ్ చేస్తే మాత్రం గతంలో బ్యాడ్జ్ వెరిఫై చేసినవి కూడా రద్దు అవుతాయి.
– ఎక్కువ సార్లు వెరిఫికేసన్ బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేయడం వల్ల మీ అకౌంట్ వెరిఫై అవుతుందన్న గ్యారెంటీ లేదు.
– మీ అకౌంట్ ఒకసారి వెరిఫై అయితే.. మీ అకౌంట్లోని యూజర్ నేమ్ మార్చడానికి వీలుండదు.
– వెరిఫై అయిన ఇన్ స్టా అకౌంట్ బ్యాడ్జ్ మరో అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయరాదని గుర్తించుకోవాలి.
– తప్పుడు సమాచారంతో యూజర్ ధృవీకరణ బ్యాడ్జ్‌ పొందితే.. Instagram ఆ బ్యాడ్జ్‌ను తీసివేస్తుంది
– అంతేకాదు.. మీ ఇన్ స్టా అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసేస్తుందని కంపెనీ సపోర్టు పేజీ (Support Page)లో స్పష్టంగా పేర్కొంది.

– మీ Instagram అకౌంట్ వెరిఫై అయితే.. మీ Facebook అకౌంట్ ఆటోమాటిక్‌గా వెరిఫై అయిపోతుందని అర్థం కాదు. మరోవిషయం ఏంటంటే… చాలామంది తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను ఫేస్ బుక్ అకౌంట్లకు లింక్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇన్ స్టా అకౌంట్ కు వెరిఫికేషన్ బ్యాడ్జ్ ధ్రువీకరిస్తే.. ఫేస్ బుక్ అకౌంట్ కు కూడా బ్లూ టిక్ వర్తించదు.. ఈ రెండూ వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు. అందుకే మీరు రెండు సోషల్ మీడియా అకౌంట్లను లింక్ చేసినప్పటికీ.. మీరు వెరిఫికేషన్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి అనేది గుర్తించుకోవాలి.

Read Also : Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!

ట్రెండింగ్ వార్తలు