Jio 5G Services in India : దేశవ్యాప్తంగా జియో 5G సర్వీసులు.. కొత్తగా మరో 2 నగరాల్లోకి.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G వెల్‌కమ్ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?

Jio 5G Services in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) చాలా వేగంగా కొత్త నగరాలకు 5 సర్వీసులను అందిస్తోంది. మరికొన్ని కొత్త నగరాల్లో జియో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది.

Jio 5G Services in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) చాలా వేగంగా కొత్త నగరాలకు 5 సర్వీసులను అందిస్తోంది. మరికొన్ని కొత్త నగరాల్లో జియో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. చాలా కాలంగా 5G సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు నిజంగా శుభవార్త అనే చెప్పాలి. టెలికాం కంపెనీ వీలైనంత త్వరగా జియో యూజర్లకు 5G నెట్‌వర్క్‌ను అందిస్తానని హామీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితమే రిలయన్స్ జియో 11 నగరాల్లో 5Gని లాంచ్ చేసింది.

ఇప్పుడు మరో రెండు భారతీయ నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఇండోర్, భోపాల్‌లోని యూజర్లు ఇప్పుడు 5Gని టెస్టింగ్ చేయవచ్చు. కానీ, ఈ నగరాల్లోని ప్రతి ప్రాంతంలో 5G అందుబాటులో ఉండకపోవచ్చని, నెట్‌వర్క్ ఇంకా స్థిరంగా లేదని గమనించాలి. ఫోన్ కాల్ సమస్యలతో పాటు డేటా డ్రైన్-అవుట్ సమస్యల గురించి వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. Jio 5G అందుబాటులో ఉన్న అన్ని భారతీయ నగరాలను ఓసారి లుక్కేయండి.

Jio 5G : అర్హత ఉన్న నగరాల జాబితా ఇదే :

* ఢిల్లీ
* ముంబై
* వారణాసి
* కోల్‌కతా
* బెంగళూరు
* హైదరాబాద్
* చెన్నై
* నాథద్వారా
* పూణే
* గురుగ్రామ్
* నోయిడా
* ఘజియాబాద్
* ఫరీదాబాద్
* గుజరాత్‌లోని 33 జిల్లాలు

Jio 5G now available in 2 new Indian cities _ Check out full list of cities and how to avail 5G invite

Read Also : Jio 5G Full List in India : రిలయన్స్ జియో 5G సపోర్టు చేసే 13 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీ ఫోన్లలో 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

* లక్నో
* త్రివేండ్రం
* మైసూరు
* నాసిక్
* ఔరంగాబాద్
* చండీగఢ్
* మొహాలి
* పంచకుల
* జిరాక్‌పూర్
* ఖరార్
* డేరాబస్సి

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలి?
రిలయన్స్ జియో అందరికీ వెంటనే 5G అందించలేమని వెల్లడించింది. యాదృచ్ఛికంగా Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను వినియోగదారులకు పంపుతుంది. జియో వినియోగదారులు MyJio యాప్‌కి వెళ్లి Jio 5G బ్యానర్‌ను చెక్ చేసుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌ని టెస్టింగ్ చేయడానికి మీకు ఆసక్తి ఉందని కంపెనీకి తెలియజేసేందుకు మీరు దానిపై Tap చేయాలి. అదనంగా, యూజర్లు 5G అందుబాటులో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారని లేదా అక్కడ ఉన్నారని కూడా నిర్ధారించుకోవాలి. మీరు Jio 5G ఆహ్వానాన్ని కొంచెం వేగంగా పొందవచ్చు.

5G సర్వీసుకు కొత్త SIM అవసరమా? 5G ధరలు ఎంత? :
ఇప్పటికే వినియోగంలో ఉన్న 4G SIMలతోనే 5Gకి కనెక్ట్ చేసుకోవచ్చునని ఇదివరకే టెలికాం కంపెనీలు ప్రకటించాయి. అంటే.. జియో యూజర్లు 5Gకి కొత్త SIM కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి, టెలికాం కంపెనీ ఇప్పుడు 5Gని ఉపయోగిస్తున్నందుకు యూజర్ల నుంచి వసూలు చేస్తోంది. ఎందుకంటే, ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

జియో యూజర్లు వేగవంతమైన స్పీడ్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ, 5G డేటాను చాలా వేగంగా ఖర్చు చేస్తుందని చెప్పవచ్చు. నిమిషాల్లో మీ మొత్తం డేటాను కోల్పోకుండా ఉండటానికి మీ ఫోన్‌లో data సేవర్ ఫీచర్‌ని ఉపయోగించండి. 5G ప్లాన్‌లను వచ్చే ఏడాది ఎప్పుడైనా ఆవిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Welcome Offer : రిలయన్స్ జియో 5G వెల్‌కమ్ ఆఫర్ ఎలా పొందాలి? 5G సర్వీసులను ఉచితంగా ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు