Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లని బంధించడం న్యాయమా: కేజ్రీవాల్

తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

Kashmiri Pandits: తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పదహారు మంది కాశ్మీరీ పండిట్లను తీవ్రవాదులు కాల్చిచంపారు. దీంతో అక్కడ పండిట్లు ప్రస్తుతం భయపడుతూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది.

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ పరిసరాల్లో మద్యం నిషేధం

ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిరసనలు అడ్డుకునేందుకు ప్రభుత్వం కాశ్మీరీ పండిట్లను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇండ్లు, కాలనీల్లోనే నిర్బంధిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు. బుధవారం ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘తీవ్రవాదులు 16 మంది కాశ్మీరీ పండిట్లను కాల్చి చంపారు. పండిట్లు ఒక్కటే కోరుతున్నారు.. తమకు భద్రత కల్పించండి అని. కానీ, కేంద్రం మాత్రం ఏమీ చేయడం లేదు. పండిట్లు నిరసన వ్యక్తం చేస్తుంటే, వాళ్లను కాలనీల్లోనే ఉంచుతున్నారు. ఇదేనా న్యాయం. 1990లలో కాశ్మీరీ పండిట్ల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. వాళ్లను ఇండ్లు, ఆఫీసులు, రోడ్ల మీదే కాల్చి చంపేస్తున్నారు. ఇది మానవత్వం కాదు. దీన్ని ఆపేందుకు ఎవరూ ఏమీ చేయడం లేదు’’ అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కొంతకాలం క్రితం ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది.

Girl Rape case: బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

దీంతో చాలా మంది తిరిగి కాశ్మీర్ చేరుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పండిట్లను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. పలువురిపై కాల్పులు జరపడంతో పదహారు మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తిరిగి కాశ్మీర్ నుంచి మళ్లీ వలస వెళ్తామని కొందరు పండిట్లు ఆవేదనతో చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వలస వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు