Minister KTR: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై కేటీఆర్ ఆగ్రహం.. సస్పెండ్‌కు ఆదేశాలు.. కారణమేమంటే?

బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్సెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Minister KTR: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్సెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అసలు విషయానికి వస్తే.. ఈనెల 24వ తేదీన మంత్రి కేటీఆర్ కాలుకు గాయం కావడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణగా బర్త్ డే వేడుకలకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉన్నారు. అభిమానులు, తెరాస శ్రేణులనుసైతం బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. అయిన ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు, అభిమానులు బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

KTR Birthday: మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు.. ఎవరెవరు ఏమన్నారంటే..

బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోనూ ఆ రోజు మంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అయితే కొందరు ఉద్యోగులు బర్త్ డే వేడుకలకు హాజరు కాలేదు. మంత్రి పుట్టిన రోజు వేడుకలకు ఎందుకు రాలేదని మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేశారు. 24గంటల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కమిషనర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేటీఆర్ పై అంత అభిమానం ఉంటే టీఆర్ ఎస్ లో చేరాలంటూ కమిషనర్ తీరును విమర్శించారు.

ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్ సదరు కమిషనర్ ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకోఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని కేటీఆర్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు