Helicopter Services: లదాఖ్ ప్రాంతంలో అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు

ప్రతి ఏటా లక్షలాది మంది జనం ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్లు రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, హెలికాప్టర్ సేవల ద్వారా పర్యాటకులు త్వరగా నచ్చిన ప్రాంతాలకు చేరుకోవచ్చు.

Helicopter Services: కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యాటకుల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేహ్, పాదమ్, లింగ్‌షెడ్, కార్గిల్, డిబ్లింగ్, నెయ్రాక్, దిస్కిట్, టర్టుక్, శ్రీనగనర్, జమ్ము ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగుతాయి. ఇవి దేశంలో అత్యంత కీలక పర్యాటక ప్రాంతాలు.

GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే

ప్రతి ఏటా లక్షలాది మంది జనం ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్లు రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, హెలికాప్టర్ సేవల ద్వారా పర్యాటకులు త్వరగా నచ్చిన ప్రాంతాలకు చేరుకోవచ్చు. సామాన్యులు, పర్యాటకులు ఎవరైనా హెలికాప్టర్ సేవలను వాడుకోవచ్చు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న మొదటి బ్యాచ్ పర్యాటకులకు సేవలు అందుతున్నాయి. హెలికాప్టర్ సర్వీస్ ఛార్జీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే టిక్కెట్ల లభ్యత, సేవల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.

Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

స్థానిక వాతావరణ పరిస్థితులు, అనుమతులు వంటి అంశాల ఆధారంగా మాత్రమే సేవలు అందుతాయి. ప్రస్తుతానికి రెండు హెలికాప్టర్లను వాడుతున్నారు. ఒకటి ఐదు సీట్లు గల బి-3 చాపర్, మరోటి పెద్ద హెలికాప్టర్ అయిన ఎమ్ఐ-172. త్వరలోనే మరికొన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించనున్నారు. అదనంగా హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు