Lemon Cultivation : నిమ్మలో….కందెన మచ్చ తెగులు నివారణ

తొలుత ఆకులపై పసుపు పచ్చటి మచ్చలు వస్తాయి. తరువాత అవి గోధుమరంగుగా మారి నల్లని మచ్చలుగా మారతాయి.

Lemon Cultivation : నిమ్మసాగులో అధికంగా కనిపించే తెగుళ్లలో కందెన మచ్చ తెగులు కూడా ఒకటి. ఆకురాలడం, ఎండుపుల్ల పడటం వంటిది ఈ తెగులు వల్ల కనిపిస్తుంది. దీనికి కారణం కందెన మచ్చ తెగులు రావటమే. ఈ తెగులు వ్యాపించటం వల్ల ఆకులు రాలటమే కాకుండా ఆకులు, కాయలపై మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు రైతులకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి.

తొలుత ఆకులపై పసుపు పచ్చటి మచ్చలు వస్తాయి. తరువాత అవి గోధుమరంగుగా మారి నల్లని మచ్చలుగా మారతాయి. చూడటానికి కందెనవలె ఉండటం వల్ల దీన్ని కందెన మచ్చ తెగులు అనిపిలుస్తున్నారు. ఇది ఎక్కవగా చెట్టు పై భాగంలో కనిపిస్తుంది. తెగులు ఆశిస్తే ఆకులు పసుపు మచ్చలు కలిగి చూసేందుకు మాలిబ్డినం లోపంలా కనిపిస్తాయి.

ఈ శిలీంద్రం కాయలపై ఒక రకమైన మచ్చలు కలుగ చేసి చూడటానికి మంగు వచ్చల్లా ఉంటాయి. ఈ తెగులు తీవ్రత వల్ల ఆకులు అధికంగా రాలిపోతుంటాయి. ఈ కందెన మచ్చ తెగులు నివారణకు ఫైరాక్లో స్ట్రోబిన్ 0.1శాతం, అజోక్సీ స్ట్రోబిన్ 0.1శాతం అనే మందులను ఆగస్టు మాసంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. చెట్టు అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు