Rice Varieties for Kharif : ఖరీఫ్‌కు అనువైన వరి రకాలు – ఎకరాకు 50 బస్తాల దిగుబడి

Rice Varieties for Kharif : వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.

Rice Varieties for Kharif :  ఖరీఫ్ వరిసాగుకు  సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా  వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో  రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీప్‌కు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తీరంగా వేరుశనగ సాగు.. పంటలో చీడపీడల నివారణ

వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్దకాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి.

వరిసాగులో నీటి కొరత ఓ వైపు, చీడపీడల సమస్య మరో వైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే.. పెరిగిన పెట్టుబడులు వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కాని, సాగు గిట్టుబాటుకాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక  వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

వానాకాలంలో సాగుచేసుకోదగిన మరో వరి రకం నూతన వరి రకం ఆర్.ఎన్.ఆర్ – 11718( పదకొండు ఏడువందల పద్దెనిమిది ) రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించిన ఈ రకం మినికిట్ దశను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మినికిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాను నమోదు చేసి రైతుల మన్నలను పొందింది. అయితే ఈ రకం చౌడునేలలకు కూడా అనుకూలమంటు  ఆర్.ఎన్.ఆర్ – 11718 ( పదకొండు ఏడువందల పద్దెనిమిది ) రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.

2019 లో  జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా  స్థానం   నుండి విడుదలైన మరో రకం జె.జి.ఎల్ 24423 . దీన్నే జగిత్యాల రైస్ వన్ గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం. వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Read Also : Lemon Farming : అధిక దిగుబడినిచ్చే నిమ్మ రకాలు – సాగులో మెళకువులు

ట్రెండింగ్ వార్తలు