Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తీరంగా వేరుశనగ సాగు.. పంటలో చీడపీడల నివారణ

Ground Nut Cultivation : ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి.

Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తీరంగా వేరుశనగ సాగు.. పంటలో చీడపీడల నివారణ

Extensive Groundnut Cultivation in Telugu states prevention of crop pests

Ground Nut Cultivation : నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్థుతం 45 నుండి 60 రోజుల దశలో పంట వుంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వేరుపురుగు, రసంపీల్చే పురుగులు, పొగాకు లద్దెపురుగుల తాకిడి అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

తెలుగు రాస్ట్రాల్లో వేరుశనగ పంటను యాసంగిలో విస్తారంగా సాగుచేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి.

చాలా ప్రాంతాల్లో పంట 40 నుండి 60 రోజుల దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో వేరుశనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో పురుగుల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటిని నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశగలో తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకుదశలో పొగాకు లద్దెపురుగు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటుంది. ఈ పొగాకు లద్దెపురుగు 6 దశలు ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలి. అలాగే సూక్ష్మపోషకాల లోపం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు