Raju Weds Rambai: గుడ్ న్యూస్.. రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షోలు.. మహిళలకు మాత్రమే.. ఇదిగో థియేటర్స్ లిస్ట్ ఇదే..

రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ అని చెప్పాలి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్యమైన విజయం సాధించింది ఈ సినిమా.

Raju Weds Rambai: గుడ్ న్యూస్.. రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షోలు.. మహిళలకు మాత్రమే.. ఇదిగో థియేటర్స్ లిస్ట్ ఇదే..

Raju Weds Rambai Movie Free Shows for Women (1)

Updated On : November 27, 2025 / 6:48 AM IST

Raju Weds Rambai:

రాజు వెడ్స్ రాంబాయి లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ అని చెప్పాలి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్యమైన విజయం సాధించింది ఈ సినిమా. రూరల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకుల హృదయాలను తాకింది. దీంతో ఈ సినిమాకు రోజురాజుకి జనాదరణ పెరుగుతోంది. కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా. మొదటిరోజు కేవలం రూ.1.40 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం మూడురోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రానున్నరోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే, తమకు, తమ టీం ఇంతటి ప్రేమ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞత చాటుకోవాలని రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) మూవీ టీం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను మహిళలు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. “మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం” అంటూ అధికారిక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలలో ఎంపిక చేసిన థియేటర్స్ లో ఈ సినిమాను మహిళలు ఫ్రీగా చూసే అవకాశాన్ని కలిపించారు. అంతేకాదు థియేటర్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. థియేటర్స్ లిస్ట్ కింద ఇవ్వబడింది.

విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ

విజయనగరం: కృష్ణ

శ్రీకాకుళం: సూర్య మహల్

రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్

కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్

ఏలూరు: అంబికా కాంప్లెక్స్

తణుకు: శ్రీ వెంకటేశ్వర

మచిలీపట్నం: సిరి కృష్ణ

విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్

గుంటూరు: బాలీవుడ్

ఒంగోలు: గోపి

నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్

కావలి: లత, మానస

చిత్తూరు: గురునాథ్

హిందూపురం: గురునాథ్

తిరుపతి: జయ శ్యామ్

నంద్యాల: నిధి

కర్నూలు: ఆనంద్

కడప: రవి

రాయచోటి: సాయి

అనంతపురం: SV సినీ మాక్స్