Raju Weds Rambai Movie Free Shows for Women (1)
Raju Weds Rambai:
రాజు వెడ్స్ రాంబాయి లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ అని చెప్పాలి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్యమైన విజయం సాధించింది ఈ సినిమా. రూరల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకుల హృదయాలను తాకింది. దీంతో ఈ సినిమాకు రోజురాజుకి జనాదరణ పెరుగుతోంది. కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా. మొదటిరోజు కేవలం రూ.1.40 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం మూడురోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రానున్నరోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, తమకు, తమ టీం ఇంతటి ప్రేమ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞత చాటుకోవాలని రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) మూవీ టీం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను మహిళలు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. “మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం” అంటూ అధికారిక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలలో ఎంపిక చేసిన థియేటర్స్ లో ఈ సినిమాను మహిళలు ఫ్రీగా చూసే అవకాశాన్ని కలిపించారు. అంతేకాదు థియేటర్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. థియేటర్స్ లిస్ట్ కింద ఇవ్వబడింది.
విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత, మానస
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
కర్నూలు: ఆనంద్
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: SV సినీ మాక్స్