అద్భుతం.. మహాద్భుతం.. ఏకంగా 6 నిమిషాల 23 క్షణాల పాటు సూర్యగ్రహణం.. ఎప్పుడంటే?
ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రారంభమై జిబ్రాల్టార్ స్రైట్ సమీపంలో భూభాగాన్ని చేరుతుంది.
Solar Eclipse 2027
Solar Eclipse 2027: ఇప్పటివరకు మనం ఎన్నో సూర్య గ్రహాలను చూశాం. అయితే, ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల వరకు కొనసాగే అతి సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని ఎప్పుడైనా చూశారా? 2027లో ఆగస్టు 2న ఇంతటి సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం వస్తుంది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య ప్రాంతాల మీదుగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగే ప్రాంతాల్లో భానుడి వెలుగు భూమి మీద పడదు. కేంద్రరేఖపై 6 నిమిషాలు 23 సెకన్ల వరకు చీకటి ఉంటుంది. 1991-2114 మధ్య భూభాగం నుంచి కనిపిస్తున్న సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహం ఇదే. ఈ శతాబ్దంలో పగటి సమయంలో అతి దీర్ఘకాలం కనిపించనున్న చీకటి ఇదేనని నిపుణులు అంటున్నారు. భూమి-సూర్యుడి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద భానుడి వెలుగుపడదు. దీంతో చీకటిగా ఉంటుంది. (Solar Eclipse 2027)
ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రారంభమై జిబ్రాల్టార్ స్రైట్ సమీపంలో భూభాగాన్ని చేరుతుంది. అక్కడి నుంచి స్పెయిన్ దక్షిణభాగం, మొరాకో, అల్జీరియా, ట్యూనీషియా, లిబియా, ఈజిప్ట్ మీదుగా మధ్యప్రాచ్య ప్రాంతాల్లోకి వెళుతుంది. ఇతర ప్రాంతాల వారు కేవలం గ్రహణాన్ని మాత్రమే చూస్తారు.
Also Read: అటు స్థానికం.. ఇటు కోటి సంతకాలు.. వైసీపీ స్పీడేది? జగన్ జిల్లాల పర్యటన ఆలస్యమవుతుందా?
సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రతలో తగ్గుదల, గాలుల వీచే తీరులో మార్పులు, జంతువుల ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు. ఆకాశం చీకటి పడటం వల్ల వీనస్, మెర్క్యురీ సహా ప్రకాశవంతమైనవి కనిపించవచ్చు. “డైమండ్ రింగ్” ఎఫెక్ట్, సన్ కరోనా వంటివి కూడా కనిపించే అవకాశం ఉంది. డైమండ్ రింగ్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి వెలుగును చంద్రుడు భూమిపై పడకుండా చేసినప్పుడు కనిపించే ప్రకాశ వలయం.
టోటల్ సోలార్ ఎక్లిప్స్‌లు భూమిపై ఎక్కడో ఒకచోట సుమారు ప్రతి 18 నెలలకు ఒకసారి జరుగుతాయి. కానీ ఇవి ఏకంగా 6 నిమిషాల పాటు అనేక ప్రాంతాల మీదుగా వెళ్లడం చాలా అరుదు. అందుకే 2026 ఆగస్టు 2న ఏర్పడే సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు, స్కై వాచ్‌ర్లకు ప్రముఖ గ్లోబల్ ఈవెంట్‌గా మారుతుంది.
