PhonePe : ఫోన్‌పేలో అద్భుతమైన ఫీచర్.. UPI పిన్ అక్కర్లేదు.. మీ ఫింగర్ ఫ్రింట్తోనే పేమెంట్లు చేయొచ్చు..!
PhonePe : డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు, యూపీఐ పిన్ ఎంటర్ చేసేందుకు ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఉపయోగించి పేమెంట్లు చేయవచ్చు.
PhonePe Biometric Authentication
- ఫోన్‌పేలో సరికొత్త ఫీచర్ వచ్చేసింది
- రూ.5వేల వరకు పేమెంట్లపై బయోమెట్రిక్ అథెంటికేషన్
- అంతకు మించి పేమెంట్లపై యూపీఐ పిన్ తప్పనిసరి
PhonePe : ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ పేమెంట్లు వెరీ ఈజీ.. యూపీఐ పేమెంట్ల కోసం ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 4 లేదా 6-అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఫోన్‌పే యూజర్లు ఇప్పుడు తమ ఫోన్ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడెంటిటీతో యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. అమెజాన్ పే, స్లైస్ (Slice) యాప్‌లో కూడా ఇలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫీచర్‌తో, రూ.5,000 వరకు యూపీఐ లావాదేవీలను బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి పూర్తి చేయవచ్చు. మీ ఫోన్లో ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ లాక్ సెట్ చేసి ఉంటే దానితో పేమెంట్ పూర్తి చేయొచ్చు. అయితే, రూ.5వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే మాత్రం సేఫ్టీ కోసం యూపీఐ పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
ఈ ఫీచర్ చాలా సేఫ్టీ అని కంపెనీ చెబుతోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ఎక్కువగా రిస్క్ ఉంటుంది. అంతేకాదు.. మీ సమీపంలో నిలబడి ఉన్న వారు ఎవరైనా మీ యూపీఐ పిన్ చూసే వీలుంది. అదే బయోమెట్రిక్ పేమెంట్లకు ఇలాంటి రిస్క్ ఉండదు. రాంగ్ పిన్ లేదా యూపీఐ పిన్ మర్చిపోయిన సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా ఉండవు.
యూపీఐ పేమెంట్లు ఇకపై వెరీ ఈజీ :
ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్ చారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫోన్‌పే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఇప్పుడు, రూ. 5వేల వరకు యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ హార్డ్‌వేర్-లెవల్ సేఫ్టీ (ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ వంటివి) అందుబాటులో ఉంది. పిన్ రాంగ్ ఎంటర్ చేసినా పేమెంట్ ఫెయిల్ వంటి సమస్య ఉండదు.
ఫోన్‌పేలో బయోమెట్రిక్ పేమెంట్ ఎలా యాక్టివేట్ చేయాలి? :
- మీ మొబైల్లో ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయండి.
- ప్రొఫైల్‌కి వెళ్లండి.
- ‘Manage Payments’పై ట్యాప్ చేయండి.
- బయోమెట్రిక్ పే ఐకాన్ ఎంచుకోండి.
- సంబంధిత బ్యాంక్ అకౌంట్ కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆన్ చేయండి.
- యూపీఐ పిన్, బయోమెట్రిక్‌తో ఒకసారి కన్ఫార్మ్ చేయండి.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అతి త్వరలో iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
