WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కొత్త గ్రూప్ సభ్యులకు ఇక నో టెన్షన్.. గ్రూపులో పాత మెసేజ్‌లు చూడొచ్చు!
Group Message History : వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ప్రవేశపెట్టింది. కొత్తగా చేరిన సభ్యులకు ఇప్పుడు నేరుగా ఒక గ్రూప్‌కు 25 నుంచి 100 రీసెంట్ మెసేజ్ పంపవచ్చు.
Group Message History
- వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
- గ్రూప్ అడ్మిన్లు, మెంబర్స్ కొత్త సభ్యులకు రీసెంట్ మెసేజ్ హిస్టరీ పంపొచ్చు
- గ్రూపులో ప్రతి ఒక్కరికీ టైమ్‌స్టాంప్, పంపినవారి డేటా కనిపిస్తుంది
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపు మెంబర్లకు పండగే.. ఇకపై వాట్సాప్ గ్రూపులలో కొత్త జాయిన్ అయ్యేవారికి భారీ బెనిఫిట్ ఉంటుంది. వాట్సాప్ గ్రూపు యూజర్ల కోసం మెటా సొంత యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. గ్రూపు మెసేజ్ హిస్టరీ ఫీచర్. ఇదేలా పనిచేస్తుందంటే.. వాట్సాప్ గ్రూపులో ఎవరైనా సభ్యులు కొత్తగా జాయిన్ అయితే వారికి అప్పటికే గ్రూపులో పాత చాట్ హిస్టరీ చూడలేరు.
ఇప్పుడు ఈ కొత్త హిస్టరీ ఫీచర్ ద్వారా కొత్త జాయిన్ అయిన యూజర్లు కూడా పాత హిస్టరీ డేటాను చూడొచ్చు. అయితే, అడ్మిన్ లేదా మెంబర్ వారికి ఇటీవలి మెసేజ్ హిస్టరీని పంపాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో వర్క్ అవుతుంది. వ్యక్తిగత మెసేజ్ మాదిరిగానే గ్రూపు మెసేజ్ చాట్ కూడా చాలా సేఫ్‌గా ఉంటుంది.
100 వరకు రీసెంట్ మెసేజెస్ చూడొచ్చు :
వాట్సాప్ ప్రకారం.. కొత్త గ్రూపు సభ్యులు 25 నుంచి గరిష్టంగా 100 రీసెంట్ మెసేజ్‌లు చూడగలరు. కొత్త వాట్సాప్ యూజర్లు గత చాట్లను స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. సంబంధిత చాటింగ్ నేరుగా చూడొచ్చు. స్క్రీన్షాట్లు లేదా వేరుగా మెసేజ్ ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. గ్రూప్ చాట్స్ మరింత సౌకర్యవంతంగా మారుతాయి.
అడ్మిన్లకు ఫుల్ పవర్స్ :
మెసేజ్ హిస్టరీ పంపడం అనేది మాన్యువల్ గా చేయాలి. కొత్త మెంబర్ గ్రూపులో జాయిన్ అయినప్పుడు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. గ్రూపు అడ్మిన్లు లేదా గ్రూపు సభ్యులు ఎవరైనా హిస్టరీ మెసేజ్ పంపాలా వద్దా అని నిర్ణయించవచ్చు. గ్రూపు అడ్మిన్లకు ఈ సెట్టింగ్ స్టాప్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే అడ్మిన్లు ఎల్లప్పుడూ మెసేజ్ హిస్టరీని షేర్ చేయగలరు. ట్రాన్సపరన్సీ కోసం మెసేజ్ హిస్టరీ పంపినప్పుడల్లా అన్ని గ్రూప్ సభ్యులకు నోటిఫై అవుతుంది.
త్వరలో రెగ్యులర్ యూజర్లకు :
కంపెనీ ప్రకారం.. హిస్టరీ మెసేజ్ స్పష్టమైన టైమ్‌స్టాంప్, పంపినవారి డేటా కనిపిస్తుంది. సాధారణ మెసేజ్ మాదిరిగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టయిల్లో కనిపిస్తాయి. గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ అందుబాటులోకి వస్తోందని, అతి త్వరలో రెగ్యుటర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్ పేర్కొంది.
వాట్సాప్ వెబ్‌లో ఇప్పటికే వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. కొంతమంది వినియోగదారులు ఇప్పుడు తమ చాట్ విండోలలో వాయిస్, వీడియో కాల్ బటన్లు చూడొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. ప్రారంభంలో వినియోగదారులు వ్యక్తిగత చాట్స్ నుంచి మాత్రమే వాయిస్ కాల్స్ చేసుకోగలరు.
