T20 World Cup 2026 : ఇదేం గ్రూప్‌గా రా అయ్యా.. ఒక జట్టును మించి మరొకటి.. అన్ని జట్లు అజేయమే.. గ్రూత్ ఆఫ్ డెత్?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 ) సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
T20 World Cup 2026 Super 8 Why group 1 is the real Group of Death
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి గ్రూప్-1పైనే ఉంది. ఎందుకంటే గ్రూప్ దశలో ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు అన్ని ఆ గ్రూపులోనే ఉన్నాయి. భారత్, వెస్టిండీస్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు ఉన్న గ్రూప్-1ను గ్రూప్ ఆఫ్ డెత్‌గా పిలుస్తున్నారు.
ఈ నాలుగు జట్లు కూడా గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అయితే.. వీటిలో రెండు జట్లు మాత్రమే సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి. ఏ చిన్న తప్పు జరిగినా కూడా జట్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
టీమ్ఇండియా..
ఈ మెగాటోర్నీలో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా టీమ్ఇండియా సూపర్ 8లో అడుగుపెట్టింది. ఓపెనర్ల దూకుడు, సమయోచిత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, ఇక పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లు నియత్రించగలిగే బౌలర్లతో కూడిన జట్టుగా భారత్ ఉంది. అయితే.. భారత్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి జట్టు పై అదనపు ఒత్తిడిని తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్-8లో మూడు అజేయమైన జట్లను ఎదుర్కొనాలంటే భారత జట్టు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా నెట్ రన్‌రేటు లెక్కలపై ఆధాపడాల్సి ఉంటుంది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్ 8 ఫార్మాట్ పై ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది?
దక్షిణాఫ్రికా..
గత కొన్నేళ్లుగా అత్యంత నిలకడైన టీ20 జట్లలో ఒకటిగా దక్షిణాఫ్రికా నిలిచింది. క్రమశిక్షణ గలిగిన బౌలింగ్, వ్యూహాత్మక క్రికెట్‌కు పేరుగాంచిన ప్రోటీస్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలదు. భారత్‌తో దక్షిణాప్రికా మ్యాచ్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ కంటే తక్కువ ఏమీ కాదు. సీనియర్లతో పాటు మూడు విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లను ఆ జట్టు కలిగి ఉంది.
వెస్టిండీస్..
టీ20 క్రికెట్‌ను వెస్టిండీస్ జట్టు కన్నా ఎవరు బాగా అర్థం చేసుకోలేరని చెప్పవచ్చు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆ జట్టులో పవర్ హిట్టర్లకు లోటులేదు. నిర్భయమైన ఆటతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఒక్క స్పెల్ లేదా కొన్ని ఓవర్లలో మ్యాచ్ గమనాన్ని మార్చే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. టీ20 క్రికెట్లో వారి నిర్భయమైన ఆట వారిని ఎంతో ప్రమాదకరమైన జట్టుగా నిలిపింది.
జింబాబ్వే..
అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టింది జింబాబ్వే. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలను సాధించింది. వారి నిర్భయమైన ఆట, వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రత్యర్థులను మట్టి కరిపించింది మేటీ జట్టుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అంచనాలు లేకపోవడం ఆ జట్టుకు ఓ వరం. ఓడిపోయినా పోయేది ఏమీ లేకపోవడంతో ఆ జట్టు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది.
గ్రూప్ 1 నుండి కేవలం రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ చాలా కీలకం. నెట్‌రన్‌రేటు కీలక అంశంగా మారొచ్చు.
