Andhra King Taluka Twitter Review: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు అంటే..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Twitter Review). మైత్రి మూవీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, రవి శంకర్‌ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించాడు.

Andhra King Taluka Twitter Review: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు అంటే..?

Ram Pothineni Andhra King Taluka Movie Twitter Review

Updated On : November 27, 2025 / 7:22 AM IST

Andhra King Taluka Twitter Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, రవి శంకర్‌ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించాడు. ఆ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్‌గా కీలకపాత్రలో కనిపించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు (నవంబర్ 27)న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ తమ ఒపీనియన్ ని సోషల్ మీడియా(Andhra King Taluka Twitter Review) వేదికగా పంచుకుంటున్నారు. మరి ఆడియన్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Raju Weds Rambai: గుడ్ న్యూస్.. రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షోలు.. మహిళలకు మాత్రమే.. ఇదిగో థియేటర్స్ లిస్ట్ ఇదే..

ఇది ప్రతి ఫ్యాన్‌కి బయోపిక్ అని, సినిమా పిచ్చి ఉన్నవారికి కొత్త అనుభూతి కలిగితుంది అని చెప్తున్నారు. అలాగే ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్ ఎమోషనల్‌‌గా సాగిందని, రామ్ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది అని, ఉపేంద్ర గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో, ఎప్పుడూ అవే రోత మాస్ సినిమాల మధ్యలో చాలా కొత్తగా అనిపించింది ఈ సినిమా. రామ్ అదరగోటేశాడు, తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు మహేష్ బ్రిలియంట్ వర్క్ చేశాడని, ఎమోషనల్‌ క్లైమాక్స్ అద్దిరిపోయింది. రామ్‌కి కమ్ బ్యాక్ మూవీ అంటున్నారు. ఇక ఈ సినిమాపై ఫుల్ రివ్యూ ఏంటో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.