Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరంక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

soil test for agriculture and management methods

Soil Test For Agriculture : పంటల్లో, దిగుబడి అనేది  నేల సారం, సాగుచేసే రకం, యాజమాన్యాన్నిబట్టి ఆధారపడి వుంటుంది. దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం.  నేలలో సహజసిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో వుంటాయి.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

వీటి స్థితి గతులను అంచనా వేయకుండా… పదేపదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటంవల్ల సాగు ఖర్చు పెరిగిపోవటమేకాక, భూ భౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరంక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను మండలాలవారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో వున్నాయి. పంటలు లేకుండా భూములు ఖాళీగా వున్న ఈ సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

చాలా ప్రాంతాల్లో భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ,  రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ.. మట్టి నమూనా సేకరించే విధానాన్ని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త విజయ్.

Read Also : Vegetable Cultivation : లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు