Keerthy Suresh: నేను ఆ సినిమా చేయడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్.. మరి మేకర్స్ ఏమంటారో..

సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) చాలా కాలం మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుంది. ఆమె చివరగా తెలుగులో నటించిన పెద్ద సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవితో చేసిన భోళా శంకర్ అనే చెప్పాలి.

Keerthy Suresh: నేను ఆ సినిమా చేయడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్.. మరి మేకర్స్ ఏమంటారో..

Heroine Keerthy Suresh clarifies that she is not acting in Yellamma movie

Updated On : November 27, 2025 / 8:58 AM IST

Keerthy Suresh; సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ చాలా కాలం మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుంది. ఆమె చివరగా తెలుగులో నటించిన పెద్ద సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవితో చేసిన భోళా శంకర్ అనే చెప్పాలి. ఆ తరువాత 2025లో నటుడు సుహాస్ తో ఉప్పు కప్పురంబు అనే సినిమా చేసింది. ఈ సినిమా వచ్చింది అని కూడా చాలా మందికి తెలియదు. అవకాశాలు లేవో, లేక ఆమెకే ఇంట్రెస్ట్ లేదో తెలియదు ఈ మధ్య ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. చాలా కాలం తరువాత ఆమె నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ రివాల్వర్ రీటా. దర్శకుడు చంద్రు తెరకెక్కిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది. అలా డైరెక్ట్ మూవీతో కాకుండా డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది ఈ మహానటి.

Andhra King Taluka Twitter Review: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు అంటే..?

తాజాగా రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా గురించి, అప్కమింగ్ సినిమాల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అయితే, ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక రిపోర్టర్ వేణు ఎల్దండి నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ గురించి ప్రస్తావించాడు. చాలా కాలం నుంచి ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా.. మీరు ఎల్లమ్మ సినిమా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘లేదు.. నేను ఎల్లమ్మ సినిమా చేయడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, గత కొంతకాలంగా ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.

నిజానికి, హీరోయిన్ విషయంలో కాదు ఎల్లమ్మ సినిమాలో నటించబోయే హీరో గురించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో నాని, శర్వానంద్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి స్టార్ హీరోల పేర్లు చాలానే వినిపించాయి. తాజాగా మ్యూజి డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. కానీ. ఇప్పటివరకు ఎవరు సినిమాలో నటిస్తున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. హీరోయిన్ మాత్రం కీర్తి సురేష్ కాదు అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎవరు హీరోగా చేస్తున్నారు, హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.