NBK 111 Movie Opening : గ్రాండ్ ఓపెనింగ్.. బాలయ్య – నయనతార కొత్త సినిమా.. NBK 111 ఫొటోలు..
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇటీవల NBK 111 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఓపెనింగ్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.









