Ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నీల్ మూవీ ‘డ్రాగన్’ కాదట.. వైరల్ చేయడం ఆపేయండి..

ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అనే చెప్పాలి. దానికి కారణం ఈ దర్శకుడికి ఉన్న ట్రాక్ రికార్డ్.

Ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నీల్ మూవీ ‘డ్రాగన్’ కాదట.. వైరల్ చేయడం ఆపేయండి..

Producer clarifies title of NTR-Prashanth Neel Dragon

Updated On : November 27, 2025 / 6:28 AM IST

Ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అనే చెప్పాలి. దానికి కారణం ఈ దర్శకుడికి ఉన్న ట్రాక్ రికార్డ్. కేజీఎఫ్ సినిమాతో ఇండియా లెవల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు. ఎమోషనల్ కంటెంట్ అలాగే హీరో ఎలివేషన్స్ తో థియేటర్స్ ను బ్లాస్ట్ చేశేశాడు. ఇక ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మాస్ ఎలివేషన్స్ గనక ఎన్టీఆర్ కి పడితే ఎలా ఉంటుందో ఊహకి కూడా అందలేదు ఆ విధ్వంసం. ఇప్పుడు, అదే కాంబో సెట్ అయ్యింది కాబట్టి ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్.

Mass Jathara OTT: రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీకి వస్తున్న మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే..

జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఆ మధ్య ఎన్టీఆర్ కి చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగినా.. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ మేరకు నెక్స్ట్ షెడ్యిల్ కోసం మూవీ టీం అంతా ఆఫ్రికా వెళ్లనున్నారట. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా గురించి ఒక విషయంలో క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత రవి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై రవి, నవీన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతల్లో ఒకరైనా ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ అంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ, అది ఫైనల్ టైటిల్ కాదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. టైటిల్ ఫిక్స్ చేశాక ఒక గ్రాండ్ ఈవెంట్ లో రివీల్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతకాలం అదే ఫైనల్ టైటిల్ అనుకోని తెగ ట్రెండ్ చేశారు. కానీ. ఇప్పుడు అది కాదు అని తెలియడంతో డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఆ కొత్త టైటిల్ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.