Google Pixel 9 Pro Fold : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. ఏకంగా రూ. 57వేలు తగ్గింపు

Google Pixel 9 Pro Fold : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా? మీరు పిక్సెల్ ఫోన్ అభిమానులు అయితే ఇది మీకోసమే.. రూ.1.20 లక్షల బడ్జెట్ లోపు కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొనేవారు తప్పక ఈ స్టోరీ చదవాల్సిందే. గత ఏడాదిలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ రూ.1,72,999కి లాంచ్ అయింది.

డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ఫారమ్ ఫ్యాక్టర్, ట్రిపుల్ కెమెరా, ప్రీమియం బ్యాక్ ఫినిష్ మన్నికైన ఫారమ్ ఫ్యాక్టర్ కలిగి ఉంది. అన్ని డిస్కౌంట్లతో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ రూ. 1,20,000 కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది. పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, గెలాక్సీ S25 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోటీగా నిలుస్తోంది. ఈ పిక్సెల్ మడతబెట్టే ఫోన్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర : ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే 2025 సేల్ సందర్భంగా రూ.53వేల ధర తగ్గింపుతో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ రూ.1,19,999కు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.4వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.1,15,999కు తగ్గుతుంది. మీరు నెలకు రూ.10వేల ఈఎంఐతో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ కొనేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తిగల కొనుగోలుదారులు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 68,050 వరకు వాల్యూ పొందవచ్చు. మీ ఫోన్ కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్స్, బ్రాండ్, మోడల్ ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదనపు చెల్లింపుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లు ఆప్షన్లు ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ డ్యూయల్ డిస్‌ప్లేతో వస్తుంది. 6.3-అంగుళాల OLED కవర్ ప్యానెల్, 8-అంగుళాల OLED మెయిన్ ప్యానెల్, రెండూ 120Hz రిఫ్రెష్ రేట్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ఉంటాయి. హుడ్ కింద, ఫోన్ టెన్సర్ G4 చిప్ 4,650mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంటుంది.

మీరు యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, మ్యాజిక్ లిస్ట్, పిక్సెల్ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ 48MP మెయిన్, 10.5MP అల్ట్రావైడ్ 10.8MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ రెండు సెల్ఫీ కెమెరాలు లభిస్తాయి.
