NIA Searches: హైకోర్టు అడ్వకేట్ శిల్పను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ.. స్టూడెంట్ మిస్సింగ్ కేసుపై ఆరా..

ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లో గల హైకోర్టు అడ్వకేట్ శిల్ఫ ఇంట్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ మిస్సింగ్ కేసు నమోదైన విషయం విధితమే. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా రాధను నక్సల్స్ లోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు ఉన్నాయి.

NIA Searches: ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లో గల హైకోర్టు అడ్వకేట్ శిల్ఫ ఇంట్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ మిస్సింగ్ కేసు నమోదైన విషయం విధితమే. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా రాధను నక్సల్స్ లోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏకకాలంలో మూడు చోట్ల NIA అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థి రాధ కిడ్నాప్ కేసు గతంలో ఎన్ఐఎ కు అప్పగించిన విషయం విధితమే. వైజాగ్ లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఎ కేసు నమోదు చేశారు.

Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..

మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధను కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్ట్ అనుభంద సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కూతురును బలవంతంగా మావోయిస్ట్ పార్టీ లో చేర్చుకున్నారని ఎన్ఐఏకు ఫిర్యాదు చేసింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారిని ఫిర్యాదు లో రాధ తల్లి తెలిపింది.

Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..

2017 లో వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురుని తీసుకెళ్లారని, 2017 నుండి రాధ ఇంటికి రాలేదని తల్లి ఫిర్యాదులో తెలిపింది. 2018 నుండి మావోయిస్ట్ పార్టీ లో చేరి ఉదయ్ అరుణ తో కలిసి ఏవోబీలో రాధ పనిస్తుంది. మావోయిస్ట్ అగ్ర నేతలు గాజర్ల రవి, దేవేంద్ర, శిల్ప, స్వప్న పేర్లను ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇందులో భాగంగా గురువారం మూడు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్ చిలుకా నగర్ లో హైకోర్టు అడ్వకేట్ శిల్ప, చేగుంటలో చైతన్య మహిళా సంఘం స్వప్న ఇంటిపై ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహిస్తుంది. అయితే నాలుగు గంటల పాటు శిల్ప నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను గచ్చిబౌలి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు