Rajasthan minister : మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే విమర్శలు…రాజస్థాన్ మంత్రిపై సీఎం వేటు

మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగింపు వేటు విధించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది...

Rajasthan minister sacked

Rajasthan minister : మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగింపు వేటు విధించారు. మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్ర గూడా (Rajendra Gudha) శుక్రవారం అన్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత రాజేంద్ర గూడాను రాష్ట్ర మంత్రి పదవి నుంచి తొలగించారు. (Rajasthan minister sacked)

మణిపూర్ ఘటనపై ప్లకార్డులతో నిరసన

రాజేంద్ర గూడా సైనిక్ కళ్యాణ్ (స్వతంత్ర బాధ్యత), హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మే 4న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై కాంగ్రెస్ సహచరులు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేయడంతో చర్చకు అంతరాయం ఏర్పడింది.

రాజస్థాన్ లో సంచలనం…

మహిళలకు భద్రత కల్పించే అంశంపై రాజేంద్ర గూడా తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తారు. (questioning own government on women safety) రాజస్థాన్‌లో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మణిపూర్‌ అంశాన్ని లేవనెత్తే బదులు సొంత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వమే ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్ర గూడా అన్నారు. దీంతో అతన్ని మంత్రి వర్గం నుంచి సీఎం తొలగించడం రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది.

నిజం మాట్లాడితే శిక్షిస్తారా? 

తాను మహిళల భద్రతపై వాస్తవాలు మాట్లాడితే మంత్రి పదవి నుంచి తొలగించి శిక్షిస్తారా అని మాజీమంత్రి రాజేంద్ర గూడా ప్రశ్నించారు. ‘‘ నేను ఎల్లప్పుడూ వాస్తవాలే చెబుతాను, వాస్తవాలు చెబితే శిక్షించారు’’ అని మాజీ మంత్రి అన్నారు.

మహిళలకు రక్షణ ఏదీ? 

‘‘రాజస్థాన్ రాష్ట్రంలో మన తల్లులు, సోదరీమణులపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి, నా సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఉదయ్ పూర్వతిలోని మహిళలకు తాను రక్షణ కల్పిస్తాని నమ్మి ఎన్నికల్లో గెలిపించారు…కానీ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి’’ అని రాజేంద్ర అన్నారు.

మంత్రిని తొలగిస్తూ సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోదం 

మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఇలా జరుగుతుంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళతామని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా రాజేంద్ర గూడాను తొలగిస్తూ సీఎం అశోక్ గెహ్లాట్ పంపిన సిఫార్సును ఆ రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రా వెంటనే ఆమోదించారు. ఈ మేర రాజస్థాన్ గవర్నర్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు