×
Ad

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగింది?

  • Published On : July 22, 2024 / 01:53 AM IST

Brazilian rock singer dies after hug (Photo Credit : Google)

Brazilian Rock Singer Dies : బ్రెజిల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాక్ సింగర్ లైవ్ ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఫ్యాన్(అభిమాని) అతడి పాలిట మృత్యువయ్యాడు. తడిగా ఉన్న అభిమానిని హగ్(కౌగిలించుకోవడం) చేసుకోవడం, ఆ వెంటనే కరెంట్ షాక్ కొట్టి అతడు చనిపోవడం జరిగాయి. ఐరెస్ ససాకి రాక్ సింగర్. అతడి వయసు 35ఏళ్లు.

సాలినోపోలిస్ లోని సోలార్ హోటల్ లో లైవ్ కన్సర్ ఇచ్చాడు. ఆ సమయంలో అతడు ఓ అభిమానిని కౌగిలించుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కేబుల్ టచ్ కావడం, విద్యుత్ షాక్ కొట్టడం జరిగాయి. దీంతో రాక్ సింగర్ ససాకి మరణించినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగింది? మృతికి కారణం ఏంటి? అనే వివరాలు సేకరిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

2023లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సువార్త గాయకుడు పెడ్రో హెన్రిక్ ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ వేదికపైనే మరణించాడు. 30 ఏళ్ల పెడ్రో.. బ్రెజిల్‌లోని ఫియరా డి సంతానాలో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇస్తుండగా కుప్పకూలిపోయాడు.

Also Read : అమెరికాలో మరో దారుణం.. భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపేశాడు.. షాకింగ్ వీడియో