FlyDubai Plane : ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి ఘటన.. వెలుగులోకి వచ్చిన వీడియో.. అసలేం జరిగిందంటే?
FlyDubai Plane : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ప్లైదుబాయ్ విమానంలో గత నెల 30న హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
FlyDubai Plane
FlyDubai Plane : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ప్లైదుబాయ్ విమానంలో గత నెల 30న హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాక్‌పిట్‌లో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై కో-పైలెట్ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో రక్తంకారుతున్నా మచ్చర్ కాక్‌పిట్ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కో- పైలెట్ ను అదుపులోకి తీసుకొని.. విమానం ప్రమాదానికి గురికాకుండా సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Gold-Silver Prices Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
ఈ వీడియోను ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాక్‌పిట్‌కు సమీపంలో ఉన్న సీటు నుంచి ప్రయాణికులు ఈ వీడియోను రికార్డు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో.. అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఓ వ్యక్తి కో-పైలట్‌ను ఉద్దేశించి హిబ్రూలో మాట్లాడారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటూ అడుగుతున్నట్లుగా సంభాషణలు ఉన్నాయి. వెంటనే ఇజ్రాయెల్‌కు చెందిన డెంటిస్ట్ డాక్టర్ షోటా ముసాయెవ్ ముందుకు వెళ్లి వైద్య సహాయం అందించారు. మరోవైపు.. కాక్‌పిట్‌లో తీవ్ర గాయాలతో పడిఉన్న మచ్చర్.. ‘అతడు నాపై చాలాసార్లు దాడి చేశాడు. కదలలేక పోతున్నా’ అని చెబుతున్న సంభాషణలు వినిపించాయి.
🚨 BREAKING: N12 RELEASES EXCLUSIVE FOOTAGE FROM FLYDUBAI TERROR ATTACK
N12 has released exclusive footage from the Flydubai flight, showing the moments when the attacker was neutralized, the struggle inside and outside the cockpit, and the search for additional pilots during… pic.twitter.com/xhQY3JulPT
— Scorpion Intel (@scorpion_intel) October 2, 2026
హింసాత్మక ఘటన తరువాత ఫ్లైదుబాయ్ విమానంను సౌదీ అరేబియాలోని తబూక్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ కో-పైలట్‌ను చేతులు కట్టేసి విమానంలోనే ఉంచిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి. వెంటనే స్మిత్ మచ్చర్ ను స్థానిక మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని భారత ఎంబసీ వెల్లడించింది. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న మచ్చర్ ఎంతో సాహసంతో కాక్ పిట్ డోర్ తెరవడంతో విమానంకు పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు ప్రముఖులు మచ్చర్ ను రియల్ హీరోగా అభివర్ణిస్తూ ప్రశంసించారు.
