Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. రూ.1.80 లక్షల ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపు..
Samsung Galaxy Z Fold 8 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఏకంగా రూ.12,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ధర, బ్యాంక్ ఆఫర్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
Samsung Galaxy Z Fold 8
- శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌పై అదిరిపోయే ఆఫర్..
- అమెజాన్ సేల్‌లో ఈ శాంసంగ్ ఫోన్ రూ.12,750 వరకు తగ్గింపు
- బ్యాంక్ కార్డులతో భారీ సేవింగ్స్.. ఎలా పొందాలంటే?
Samsung Galaxy Z Fold 8 : ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లతో రూ.12,700కు పైగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్ వివరాలు, ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అధికారిక ధర రూ.1,79,999గా ఉంది. అయితే అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్‌పై నేరుగా రూ.5వేలు తగ్గింపు లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.1,74,999కు తగ్గింది. ICICI బ్యాంక్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే అదనంగా రూ.7,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Telangana SSC Exam Fee : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీలోగా పరీక్ష ఫీజు కట్టేయండి..!
అన్ని ఆఫర్లతో మొత్తం రూ.12,750 వరకు ఆదా చేసుకోవచ్చు. HDFC బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.7వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత బెనిఫిట్ పొందవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్పెసిఫికేషన్లు :
ఈ ఫోల్డబుల్ ఫోన్లో 7.6 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్ప్లే ఉన్నాయి. రెండు స్క్రీన్లలోనూ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్ ఉన్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ పొందవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే..
ఇందులో 4,800mAh డ్యూయల్ బ్యాటరీ ఉంది. 45W వైర్డ్, 20W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఆండ్రాయిడ్ 17పై రన్ అయ్యే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. రెండు డిస్ప్లేలపైనా 10MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
