Telangana SSC Exam Fee : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీలోగా పరీక్ష ఫీజు కట్టేయండి..!
Telangana SSC Exam Fee : తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027 ఫీజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 16లోగా ఫీజు చెల్లించండి. లేట్ ఫీజులు, పరీక్ష ఫీజు వివరాలు తెలుసుకోండి.
Telangana SSC Exam Fee
- పదో తరగతి పరీక్షలకు రెడీ అవుతున్నారా?
- టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2027.. ఫీజు తేదీలివే
- నవంబర్ 16 మిస్ అయితే అదనపు భారం
Telangana SSC Exam Fee : తెలంగాణలో టెన్త్ చదివే విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చి 2027లో జరగనున్న ఎస్ఎస్సీ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు పేమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారం.. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
ముఖ్యంగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించాలనుకునే విద్యార్థులు నవంబర్ 16, 2026లోగా ఈ పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయడం ఎంతైనా మంచిది.. ఇంతకీ ఫీజు ఎంత కట్టాలి? ఏ తేదీ వరకు టైమ్ ఉంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీజు చెల్లింపు తేదీలివే :
విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16, 2026 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా తమ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
- రూ.50 ఆలస్య రుసుము : నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1, 2026 వరకు
- రూ.200 ఆలస్య రుసుము : డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14, 2026 వరకు
- రూ.500 ఆలస్య రుసుము : డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28, 2026 వరకు
టెన్త్ పరీక్ష ఫీజు ఎంతంటే? :
అన్ని సబ్జెక్టులకు కలిపి సాధారణ పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు. 3 సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.110 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు సాధారణ ఫీజుకు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC విద్యార్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
Read Also : Telangana Police Jobs : తెలంగాణ యువతకు పండగే.. పోలీసు కొలువులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!
స్కూల్ లాగిన్ ద్వారానే పేమెంట్లు :
పరీక్ష ఫీజును అధికారిక వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీ విధానంలోనే చెల్లించాలి. పోర్టల్ చలాన్లు, మాన్యువల్ బ్యాంక్ చలాన్లను స్వీకరించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల వివరాలను హెచ్ఎంలు నిర్ణీత గడువులోగా DEO, DGEలకు ఆన్లైన్లో సమర్పించాలి.
ఫీజు పేమెంట్ గడువును పొడిగించేది లేదని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో విద్యార్థులు లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రాసెస్ పూర్తి చేయడం బెటర్. మరిన్ని వివరాల కోసం స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించండి..
