Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం సినిమా ఎఫెక్ట్.. నాలుగు సినిమాల పరిస్థితి ఏంటి..?
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కారణంగా పలు చిన్న సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి.(Aadarsha Kutumbam)
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam : రిలీజ్ విషయంలో భారీ చర్చకు దారి తీసిన వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా ఫైనల్‌గా థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 30న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియెన్స్ ముందుకొస్తున్నట్లు ఇటీవల కొత్త విడుదల తేదీని దసరా రోజు అఫీషియల్‌గా ప్రకటించింది త్రివిక్రమ్ టీం. మొత్తంగా అక్టోబర్‌లోనే 2 సార్లు వాయిదా పడి తిరిగి అక్టోబర్ ఎండింగ్‌కి బాక్సాఫీస్ ముందుకు వస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కారణంగా పలు చిన్న సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి.
ఆదర్శ కుటుంబం విడుదలవుతున్న అక్టోబర్ 30న మూడు చిన్న సినిమాలు, ఒక మిడ్ రేంజ్ సినిమా కూడా రేసులో ఉన్నాయి. అందులో విశ్వక్ సేన్ కల్ట్ సినిమా ఒకటి కాగా ఇట్లు అర్జున, సమ్మర్ హాలీడేస్, కిల్లర్.. మిగిలిన సినిమాలు. ఈ సినిమాలపై ఆదర్శ కుటుంబం ప్రభావం ఎక్కువుగా ఉండే చాన్సెస్ కనిపిస్తున్నాయి. కల్ట్ సినిమాకి ఫేస్ ఆఫ్ అట్రాక్షన్‌గా విశ్వక్ సేన్ ఉన్నాడు కాబట్టి కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయని అంచనా.
Also Read : Chaithra Rai : కూతుళ్లతో కలిసి బిగ్ బాస్ చైత్ర రాయ్ క్యూట్ ఫోటోలు.. దసరా స్పెషల్..
అనీష్ హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్గా చేస్తోన్న సినిమా ఇట్లు అర్జున. ఇందులో హీరో మూగవాడిగా నటించడం, నాగార్జున రిలీజ్ చేయడం అనే అంశాలు తప్పితే ఈ సినిమాపై అంత బజ్ కూడా లేదు. ఇప్పటికే ఈ సినిమా కూడా పలు మార్లు వాయిదా పడింది.
ఇక సమ్మర్ హాలీడేస్ పూర్తిగా చిన్న పిల్లల సినిమా. సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదాలు పడుతూ దీపావళి టైంకి వస్తుంది. అసలు ఆ టైటిల్, కథకు రిలీజ్ ఇప్పుడు కరెక్ట్ కానీ కాదు. కానీ నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ మెయిన్ లీడ్ లో కిల్లర్ అనే సినిమా కూడా అదే డేట్ కి వస్తుంది. ఆ సినిమా కూడా పలు మార్లు వాయిదా పడింది. అసలు ఆ సినిమాకు అయితే బజ్ లేదు. దీంతో ఈ సినిమాలపై ఆదర్శ కుటుంబం ప్రభావం కచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Rajinikanth : 200 మంది అమ్మాయిల మధ్యలో రజినీకాంత్ డ్యాన్స్.. ఎడిటింగ్‌లో కట్.. నిరాశలో ఫ్యాన్స్..
చిన్న సినిమాలపై ఆదర్శ కుటుంబం సినిమా ఎఫెక్ట్ ఎలా ఉండనుందో క్లియర్ కట్‌గా తెలుస్తోంది. విడుదల విషయంలో ఆదర్శ కుటుంబం మేకర్స్ ప్లానింగ్ తప్పడంతోనే ఈ పరిస్థితి. రిలీజ్ పరంగా ఇప్పటికే రెండుసార్లు మాట తప్పిన ఈ సినిమా.. ఇకపై నో మోర్ బ్యాక్ స్టెప్ అంటున్నారు. దీంతో చిన్న సినిమాలు ఏమైనా వెనక్కి తగ్గే చాన్సుందా అనే చర్చ జరుగుతోంది. కల్ట్, ఇట్లు అర్జున, సమ్మర్ హాలిడేస్ సినిమాల ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. మరి అక్టోబర్ 30న ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో, ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.
