Rajinikanth : 200 మంది అమ్మాయిల మధ్యలో రజినీకాంత్ డ్యాన్స్.. ఎడిటింగ్‌లో కట్.. నిరాశలో ఫ్యాన్స్..
రజిని, తమన్నా వేసిన స్టెప్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. (Rajinikanth)
Rajinikanth
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఎప్పట్లాగే రజిని తన స్టైల్, మేనరిజం, స్లో మోషన్ ఎలివేషన్స్ తో పాటు, ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ యాక్షన్స్ తో జైలర్ 2 సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను మెప్పిస్తుంది.
అయితే జైలర్ 2 సినిమా తీసిన షూటింగ్ లో చాలా శాతం ఎడిటింగ్ లో తీసేశారని మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో చెప్పింది. కొన్ని రజినీకాంత్ ఎలివేషన్స్, హృతిక్ రోషన్, మోహన్ లాల్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు. అయితే వీటితో రజినీకాంత్ డ్యాన్స్ కూడా ఎడిటింగ్ లో తీసేశారంట. జైలర్ సినిమాలో తమన్నాతో కలిసి స్పెషల్ సాంగ్ లో రజిని స్టెప్పులు వేసి అదరగొట్టారు. కావాలయ్యా.. అంటూ రజిని, తమన్నా వేసిన స్టెప్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.
Also Read : Mahesh Babu : ‘వారణాసి’లో మహేష్ బాబు డూప్ ఇతనేనా? మహేష్ బాడీ డబుల్ వైరల్..
జైలర్ 2లో కూడా పూర్ణతో స్పెషల్ సాంగ్ పెట్టారు. అల బోలెలో అంటూ సాగిన ఈ స్పెషల్ సాంగ్ లో దాదాపు 200 మంది మహిళా డ్యాన్సర్లు, పూర్ణ కలిసి డ్యాన్స్ చేసారు. పూర్ణ చేసిన హుక్ స్టెప్ వైరల్ అయింది. సాంగ్ షూట్ లో ఆ హుక్ స్టెప్ తో పాటు మరో స్టెప్ కూడా రజిని వేశారంట. ఈ విషయాన్ని జైలర్ 2లో నటించిన నటుడు జాఫర్ సాదిక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
కానీ రజినీకాంత్ చేసిన ఆ డ్యాన్స్ స్టెప్స్ ని ఎడిటింగ్ లో తీసేశారని తెలిపాడు. ఇన్ని ఎలివేషన్స్ పెట్టిన దర్శకుడు రజిని సినిమా మొత్తంలో చేసిన ఒకేఒక్క స్టెప్ ఎందుకు ఎడిటింగ్ లో తీసేశారని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆ స్టెప్ కూడా ఉండి ఉంటె థియేటర్స్ లో మంచి వైబ్ ఉండేది అని ఫీల్ అవుతున్నారు. అయితే రజినీకాంత్ వేసిన డ్యాన్స్ ని కొన్ని రోజుల తర్వాత డిలీటెడ్ సీన్ అని యూట్యూబ్ లో అప్లోడ్ చేసే అవకాశం ఉందని కూడా తెలిపాడు జాఫర్.
