Eknath Shinde: షిండే భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

Eknath Shinde: ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన షిండే భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు షిండేకు అనుకూలంగా తీర్పునిస్తే మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 53 మందికి అసెంబ్లీ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో షిండే వర్గంతోపాటు, ఉద్ధవ్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

Vijayendra Prasad: ‘రజాకార్ ఫైల్స్’పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్

ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు. షిందే వర్గం చీఫ్ విప్‌ను ఎన్నుకోవడంతోపాటు, విశ్వాస పరీక్ష, స్పీకర్ ఎన్నిక, 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. షిండే క్యాంపునకు చెందిన భరత్ గోగావాలేనె అసెంబ్లీలో శివసేన చీఫ్ విప్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ థాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయాలని ఇంకో పిటిషన్ వేశారు.

Pawan Kalyan : ప్రశ్నిస్తే బెదిరించడం, భయపెట్టడం వైసీపీ నైజం-పవన్ కళ్యాణ్

దీనికి వ్యతిరేకంగా షిండే క్యాంపు ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు ఈ నెల 12 వరకు కోర్టు గడువునిచ్చింది. ఈ రెండు పిటిషన్లు కూడా నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని అటు షిండే వర్గం, ఇటు థాక్రే వర్గం ఆశిస్తోంది. ఇంకోవైపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కోర్టులు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు