Tomato pooja : ధరలు తగ్గించు తల్లీ .. టమాటాలతో అమ్మవారికి పూజలు,టమాటాలే నైవేద్యం..భక్తులకు అవే ప్రసాదం

దేవతలకైనా దేవుళ్లకైనా పూలతో పూజలు చేస్తారు. కొబ్బరి కాయలు కొట్టి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఇది టమాటాల కాలం. కాబట్టి దేవళ్లకు,దేవతలకు చేసే పూజల్లో టమాటాలు వచ్చి చేరాయి. అమ్మవారికి టమాటాలతో పూజలు చేసి టమాటాల దండలు వేసి టమాటాలే నైవేద్యంగా పెట్టారు భక్తులు.

Tomato pooja..Tomato Garland

Tomato pooja..Tomato Garland : టమాటా..టమాటా..టమాటా. ఇదే దేశంలో హాట్ టాపిక్ గా ఉంది. కిలో రూ.250 అమ్ముతోంది.ఇది త్వరలోనే రూ.300లకు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక టమాట సామాన్యులకు అందని పండేనా అనిపిస్తోంది. టమాటా పేరు చెబితేనే హడలిపోతున్నాం. కిలో టమాటాలు కంటే కిలో చికెన్ బెటర్ అనిపిస్తోంది. సరాసరిగా చికెన్, టమాటాలు ఒకే స్థాయిలో ఉన్నాయి.

ఇప్పుడు టమాటా కూర వండుకున్నవారే రిచ్ అనేలా ఉంది. అటువంటి టమాటాలు దేశంలో వింత వింత చోరీలకు కారణమవుతున్నాయి. విచిత్ర ఘటనలకు ప్రేరేపిస్తున్నాయి. ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు పిల్లలనుతాకట్టు పెట్టి నాలుగు కిలోల టమాటాలు పట్టుకెళ్లిన ఘటన టమాటాల డిమాండ్ ఏంటో చెబుతోంది. అటువంటి టమాటాల ధర తగ్గించు తల్లీ అంటూ అమ్మవారికి మొక్కుకుంటున్నారు భక్తులు. టమాటాలతో దండ అమ్మవారి మెడలో వేసి ప్రత్యేక పూజలు చేసిన ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటుచేసుకుంది.

Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

నాగపట్టణం జిల్లా (Nagapatnam district)కురుకుడి( Kurukudi)లో ప్రముఖ మహా మరియమ్మన్, నాగమ్మన్ ఆలయానికి (Mariamman and Nagamman temple)రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. తమిళనాడులో ప్రస్తుతం గడిచే మాసానిన్న ఆడిమాసంగా భావిస్తారు. ఈ ఆడి మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు అమ్మవారికి టమాటాలతో దండలు తయారు చేసి టమాటాల ధరలు తగ్గించాలని మొక్కుకున్నాడు. 508 టమాటాలతో దండలు తయారు చేసి అమ్మవారికి మొక్కుకుంటున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారుచేసి.. అమ్మవారి మెడలో అలంకరించారు.

Tomato Prices : కిలో టమాటాలు రూ.80లకే విక్రయిస్తున్న రైతు సోదరులు ..

సాధారణంగా మహా మరియమ్మన్, నాగమ్మన్ లకు సంతానం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక కష్టాలు తీర్చాలని ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. కానీ రోజు రోజుకు ఆకాశంవైపే చూస్తున్న టమాట ధరలను తగ్గించాలని మొక్కుకుంటున్నారు. టమాటాలతో అమ్మవారిని అలంకరించి ధరలు తగ్గించాలంటూ కోరుకున్నారు. భక్తులు సమర్పించే పూలమాలతో కళకళలాడే అమ్మవారు నిమ్మకాయలు,టమాటాలు వేసి అమ్మవారిని పూజించడం వైరల్ అవుతోంది. ఈ సిట్యువేషన్ టమాటా ధరకు నిదర్శనంగా కనిపిస్తోంది. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు పంచిపెడుతున్నారు. ఆ టమాటాలు అందుకోవటం కోసం భక్తులు పోటీలు పడుతున్నారు.

Onions Smelly In Flight : ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన, హడలిపోయిన ప్రయాణీకులు.. ఎమర్జన్సీ ల్యాండ్ చేసిన పైలట్

రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని, మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. పంట అధికంగా పండే ప్రాంతాలలో ముందు ఎండలు, తర్వాత భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయాల వల్ల నెలకు పైగా టమోటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి

కాగా..దాదాపు రెండు నెలల నుంచి టమాటా ధరలు ఏమాత్రం తగ్గటంలేదు. రికార్డుస్థాయిలో రోజుకో ధర పలుకుతోంది. దీంతో టమాటా ధరలు పెరుగుదలతో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టమాటాల కోసం దొంగతనాలు, దోపిడీలకు కూడా వెనుకాడటం లేదు.

 

ట్రెండింగ్ వార్తలు