Where’s Joe Biden?: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై సామాజిక మాధ్యమాల్లో వదంతులు

కొన్ని రోజులుగా ఆయన ఎందుకు కనపడడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని రోజులుగా ఆయన ఎందుకు కనపడడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. Where’s Joe Biden? ట్యాగ్‌తో ఆయన గురించి ట్వీట్లు చేస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి ఒక్కసారి కూడా ఆయన బయట కనపడలేదని కొందరు ట్వీట్లు చేశారు. జో బైడెన్ కు కరోనా సోకిందని, ఆయన ఐసొలేషన్‌లో ఉంటున్నారని, గత వారం శ్వేతసౌధం ప్రకటన చేసిన విషయం విదితమే.

అయినప్పటికీ సోషల్ మీడియా యూజర్లు బెడెన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ పోస్టులు చేస్తున్నారు. అంతేగాక, జో బైడెన్ ను అధ్యక్ష పదవి రేసులో లేకుండా చేసేందుకు రిపబ్లికన్ పార్టీ కుట్ర పన్నిందని కొందరు అంటున్నారు. ట్రంప్ తో డిబేట్లో పాల్గొన్న తర్వాత బైడెన్ పై సొంత డెమొక్రటిక్ పార్టీ నుంచి కూడా అమెరికా అధ్యక్షుడిపై విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది. డిబేట్లో సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయారని బైడెన్ పై ఒత్తిడి పడింది.

Also Read: పాత పన్ను విధానం.. కొత్త పన్ను విధానం.. ఏది బెస్ట్?

ట్రెండింగ్ వార్తలు